Deepesh Bhan: చిత్ర సీమలో మరో విషాదం! క్రికెట్‌ ఆడుతూ ప్రముఖ కమెడియన్‌ మృతి..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవెడ్‌ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ (41) శనివారం ఉదయం (జులై 24) మరణించారు. శనివారం ఉదయం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా..

Deepesh Bhan: చిత్ర సీమలో మరో విషాదం! క్రికెట్‌ ఆడుతూ ప్రముఖ కమెడియన్‌ మృతి..
Deepesh Bhan

Updated on: Jul 24, 2022 | 9:27 AM

Bhabiji Ghar Par Hain’s Deepesh Bhan Passes away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవెడ్‌ బుల్లితెర నటుడు, కమెడియన్ దీపేష్ బాన్ (41) శనివారం ఉదయం (జులై 24) మరణించారు. శనివారం ఉదయం క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘భాబీ జీ ఘర్‌ పర్‌ హై’ సీరియల్ తో పాపులర్‌ అయని దీపేష్‌ తన నట జీవితంలో ఎన్నో కామెడీ పాత్రలను పోషించి ఎందరో అభిమానులకు దగ్గరయ్యారు. కామెడీ కా కింగ్, కామెడీ క్లబ్, భూత్ వాలా, ఎఫ్‌ఐఆర్‌, ఛాంప్‌ వంటి షోల ద్వారా మెప్పించిన దీపేష్ పలు సినిమాల్లో కమెడియన్ గా కూడా కనిపించారు. దీపేష్‌ హఠాత్తు మరణంతో బాలీవుడ్‌ చిత్ర సీమలో విషాదం ఛాయలు అలముకొన్నాయి. ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

దీపేష్‌ మరణవార్తను సహనటి ప్రముఖ టీవీ స్టార్ కవితా కౌశిక్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నిన్న దీపేష్ భాన్ మరణించారనే వార్త వినడంతో మేమంతా షాక్‌కు గురయ్యాం. దిపేష్‌ చాలా ఫిట్‌గా ఉంటారు. తనకు ఆల్కహాల్‌/సిగరేట్‌ అలవాట్లు కూడా లేవు. ఆరోగ్యానికి హాని తలపెట్టే ఏ అలవాటులేని దీపేష్‌ ఏడాది బిడ్డ, భార్య, తల్లిదండ్రులను విడిచిపెట్టి అర్థాంతరంగా మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు’ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దీపేష్ శనివారం ఉదయం క్రికెట్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.’తారక్ మెహతా కా ఊల్తా చష్మా, మే ఐ కమ్ ఇన్ మేడమ్ వంటి సీరియల్స్‌లో కూడా దీపేష్ నటించారు. దీపేష్‌కు భార్య, ఒక కొడుకు ఉన్నారు.