NPCC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గమనిక! నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోనున్న నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NPCC).. ఒప్పంద ప్రాతిపదికన సైట్ ఇంజినీర్ పోస్టుల (Site Engineer Posts) భర్తీకి..

NPCC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గమనిక! నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగాలు..
Npcc Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 24, 2022 | 8:40 AM

NPCC Limited Site Engineer(Civil) Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోనున్న నేషనల్‌ ప్రాజెక్ట్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NPCC).. ఒప్పంద ప్రాతిపదికన సైట్ ఇంజినీర్ పోస్టుల (Site Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సైట్ ఇంజనీర్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.33,750ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందియన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి బీటెక్‌ సివిల్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 5, 2022.

అడ్రస్‌: NPCC Ltd, Hyderabad Office, 4th Floor, Sarojini Plaza, Madhavpuri Hills, Road No.6, PJR Layout, Chandanagar, Hyderabad5000050.Ph. No. 9177444593.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.