‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల

హైదరాబాద్: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ చిత్ర టీజర్‌ విడుదలైంది. హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో టీజర్ విడుదలైంది. టీజర్‌లో ‘కడలల్లే వేచే కనులే..’ అంటూ పాట సాగుతుండగా ఫైటింగ్ సీన్.. విజయ్, రష్మికల మద్దు సీనును చూపించారు. గీత గోవిందం మూవీ తర్వాత విజయ్, రష్మికలు కలిసి నటించిన మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్, […]

డియర్ కామ్రేడ్ టీజర్ విడుదల

Updated on: Mar 17, 2019 | 1:03 PM

హైదరాబాద్: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో రూపొందిన ‘డియర్ కామ్రేడ్’ చిత్ర టీజర్‌ విడుదలైంది. హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో టీజర్ విడుదలైంది.

టీజర్‌లో ‘కడలల్లే వేచే కనులే..’ అంటూ పాట సాగుతుండగా ఫైటింగ్ సీన్.. విజయ్, రష్మికల మద్దు సీనును చూపించారు. గీత గోవిందం మూవీ తర్వాత విజయ్, రష్మికలు కలిసి నటించిన మూవీ ఇది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భరత్ దర్శకత్వం విహిస్తుండగా, ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.