ఈ పాట విని ఉద్వేగానికి లోనయ్యా.. అమ్మ ఏడ్చింది..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రెడ్’. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘కడలల్లే కన్నులే’ అనే పాట లిరికల్ వీడియోను విజయ్ దేవర కొండ బుధవారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఉదయం లేవగానే భరత్ మేసేజ్ చేశాడని, ఓపెన్ చేయగా అది పాటని.. ఆ పాటను వినగానే ఉద్వేగానికి లోనేటట్టు తెలిపారు. అలాగే.. ఈ పాటను ఇంట్లో ప్లే చేస్తుంటే.. ఇది […]
విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రెడ్’. ఈ సినిమాకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘కడలల్లే కన్నులే’ అనే పాట లిరికల్ వీడియోను విజయ్ దేవర కొండ బుధవారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఉదయం లేవగానే భరత్ మేసేజ్ చేశాడని, ఓపెన్ చేయగా అది పాటని.. ఆ పాటను వినగానే ఉద్వేగానికి లోనేటట్టు తెలిపారు. అలాగే.. ఈ పాటను ఇంట్లో ప్లే చేస్తుంటే.. ఇది విని అమ్మ కళ్లు చమర్చాయని.. ఇప్పుడు మీరూ వినండని.. ట్వీట్‌లో వెల్లడించాడు డియర్ కామ్రేడ్. కాగా ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
One morning, when I woke up – I had a message from Bharat, it was an audio file.
I heard it, it made me emotional, I teared up. Everytime I play the song at home I see tears in mummy’s eyes. Now the song is yours, experience it 🙂 #DearComrade https://t.co/SiYDPJdXg7
— Vijay Deverakonda (@TheDeverakonda) May 15, 2019