అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోమారు వార్తల్లో నిలిచాడు. అతనిపై విషప్రయోగం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన దావూద్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా జోరుగా పుకార్లు వచ్చాయి. కానీ అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారించాయి. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది. భారత్‌తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ క్రిమినల్ గా ప్రకటించింది. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది.
అయితే ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. అప్పట్లో ఈ విషయం పెను సంచలనం సృష్టించింది. నటీమణులతోపాటు నిర్మాతలు, దర్శకులు కూడా ఇతని వలలో చిక్కుకుని విలవిలలాడారు. దావూద్‌తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్లలో మందాకిని ఒకరు. 80-90 దశకంలో ఓ వెలుగు వెలిగిన బాలీవుడ్ నటి మందాకిని తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపుఊపింది. రాజ్ కపూర్ తెరకెక్కించని ‘రామ్ తేరీ గంగా మైలీ’తో ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మందాకిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక్క ఫొటో ఆమె కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసింది.
దావూద్ ఇబ్రహీం కూడా మందాకిని అందానికి మత్తెక్కిపోయాడు. ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు. చాన్నాళ్లు చట్టాపట్టాలేసుకు తీరిగారు కూడా. అయితే వీరి రిలేషన్ కారణంగా మందాకిని కెరీర్ ప్రమాదంలో పడింది. 1994లో దుబాయ్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో మందాకిని, దావూద్ కలసి పక్కపక్కనే కూర్చున్న ఫోటో ఒకటి కనిపించింది. ఈ ఫోటో అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఫోటో కారణంగా మందాకినిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆమె దావూద్ నేర కార్యకలాపాలలో భాగస్తురాలనే ప్రచారం జోరుగా జరిగింది. క్రమంగా సినీ అవకాశాలు కూడా తగ్గడంతో మందాకిని కెరీర్ కుప్పకూలడం మొదలైంది. దావూద్‌పై ఉన్న నెగెటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో క్రమక్రమంగా మందాకినీ సినీపరిశ్రమకు దూరమైంది. చివరిగా 1996లో విడుదలైన జోర్డాలో ఆమె కనిపించింది. ఆ తర్వాత దుబాయ్‌లో స్థిరపడింది. ఇదొక దురదృష్టకర సంఘటన. సినీవినీలాకాశంలోఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మందాకిని కెరీర్ దావూద్‌తో ప్రేమ కారణంగా పూర్తిగా పతనమైంది. 1990లో మందాకిని ప్రముఖ వైద్యుడు కాగ్యూర్ రింపోచే ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇనాయ, రబిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.