నటి డిగంగనా సూర్యవంశీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:49 PM

చిన్న‌ వయసులోనే ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును అందుకుంది నటి డిగంగనా సూర్యవంశీ. ఈమె నటి, గాయని, రచయిత్రి అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాల్లో పేరు తెచ్చుకుంటోంది. తన ఏడవ ఏటనే బాలనటిగా రంగప్రవేశం చేసిన డిగంగనా సూర్యవంశీ పలు హిందీ సిరీస్‌లో నటిస్తూ ప్రాచుర్యం పొంది౦ది. గత ఏడాది సినీ నటిగానూ రంగప్రవేశం చేసింది. ఈమె నటించిన ఏక్‌ వీర్‌ కీ అర్ధాస్‌…సిరీస్‌ హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం పలు భాషల్లో […]

నటి డిగంగనా సూర్యవంశీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
Follow us on

చిన్న‌ వయసులోనే ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును అందుకుంది నటి డిగంగనా సూర్యవంశీ. ఈమె నటి, గాయని, రచయిత్రి అంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాల్లో పేరు తెచ్చుకుంటోంది. తన ఏడవ ఏటనే బాలనటిగా రంగప్రవేశం చేసిన డిగంగనా సూర్యవంశీ పలు హిందీ సిరీస్‌లో నటిస్తూ ప్రాచుర్యం పొంది౦ది. గత ఏడాది సినీ నటిగానూ రంగప్రవేశం చేసింది. ఈమె నటించిన ఏక్‌ వీర్‌ కీ అర్ధాస్‌…సిరీస్‌ హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం పలు భాషల్లో అనువాదమై విశేష ప్రేక్షకాదరణను చూరగొంది. ఫ్రైడే అనే హిందీ చిత్రంతో నాయకిగా పరిచయం అయ్యింది. ప్రస్తుతం హిప్పీ అనే చిత్రంతో హీరోయిన్ గా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది.