మరో వివాదంలో కాంట్రవర్సీ క్వీన్.. ఆ లీడర్‌‌‌‌ను అవమానించినందుకు కంగన పై సివిల్ కోర్టులో ఫిర్యాదు

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరో వివాదం లో చిక్కుకుంది. కంగన వాళ్ళు వీళ్ళు అని తేడాలేకుండా అటు సినిమా స్టార్స్ ను, ఇటు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ  నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మరో వివాదంలో కాంట్రవర్సీ క్వీన్.. ఆ లీడర్‌‌‌‌ను అవమానించినందుకు కంగన పై సివిల్ కోర్టులో ఫిర్యాదు

Updated on: Dec 19, 2020 | 1:40 PM

బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. కంగన వాళ్ళు వీళ్ళు అని తేడాలేకుండా అటు సినిమా స్టార్స్ ను, ఇటు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ  నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల ఈ కాంట్రవర్సీ క్వీన్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పి) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ పై అవమానకరంగా ట్వీట్ చేసిందంటూ కోర్ట్ లో కేసు ఫైల్ అయ్యింది. ఆర్.ఎల్.ఎస్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుష్వాహా ఇటీవల ఓ సందర్భం లో మాట్లాడుతూ..  కంగనపై సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

డిసెంబర్ 3 న కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా కుష్వాహా ఎత్తును హేళనచేస్తూ కామెంట్ చేసింది. ఆర్.ఎల్.ఎస్.పి చీఫ్ ను ఎగతాళి చేస్తూ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఫోటోపై డిసెంబర్ 3న క్వీన్ వ్యాఖ్యానించారు. సదరు నాయకుడిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కంగన పై  కఠిన చర్యలు తీసుకోవాలని వినయ్ కుష్వాహా కోర్టును కోరారు. నాయకుడిపైనా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం నేరం అని లాయర్ శంభు ప్రసాద్ అన్నారు. మరి ఈ వివాదంపై కంగన ఎలా స్పందిస్తుందో చూడాలి.