AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

సుమన్ శెట్టి.. మొన్నటి వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు , కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు ఈ టాలీవుడ్ నటుడు. గత కొంతకాలంగా సుమన్ శెట్టి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. బిగ్ బాస్ ద్వారా మరోసారి సుమన్ శెట్టి పేరు మారుమ్రోగింది.

Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి
Suman Setty
Rajeev Rayala
|

Updated on: May 12, 2026 | 2:54 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కమెడియన్ సుమన్ శెట్టి. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేసి నవ్వులు పూయించారు సుమన్ శెట్టి. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలనూ పాల్గొన్నారు సుమన్. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  సీనియర్ నటులు తమకంటే చిన్నవారిని దూరం పెడతారనే అపోహను  నటుడు సుమన్ ఖండించారు. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన మధుర జ్ఞాపకాలను, సీనియర్ల నుంచి లభించిన మద్దతును ఆయన పంచుకున్నారు. ఈ పరిశ్రమలో మంచి వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. వేణు మాధవ్ తో అనుబంధం గురించి వివరిస్తూ, రాజమండ్రిలో టి. రాజేందర్ గారి ప్రేమ సాగరం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను సుమన్ గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

అప్పట్లో తనకు కారవాన్ లేదని, రాజమండ్రి తీవ్రమైన ఎండలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. ఆ సమయంలో సీనియర్ నటుడైన వేణు మాధవ్ తనను పిలిచి, తన కారవాన్‌లోకి రమ్మని ఆహ్వానించారట. ఎండకు బయట కూర్చోవద్దని, తన కారవాన్‌ను ఉపయోగించుకోవాలని సూచించారని సుమన్ అన్నారు. అంతేకాకుండా, వేణు మాధవ్ ప్రతి ఉదయం ఆనంద్ రెసిడెన్సీ నుండి స్వయంగా క్యారెట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేవారని, ఒక తల్లి తన కొడుకును చూసుకున్నట్లే తనను చూసుకున్నారని సుమన్ ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ఆలీ, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కూడా షూటింగ్‌లో సరదాగా, మద్దతుగా ఉండేవారని, తనకు ఎప్పుడూ నెగిటివ్ అనుభవాలు ఎదురుకాలేదని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా సుమన్ వివరించారు. తన అభిమాన హీరోలైన పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబులలో పవన్ కళ్యాణ్ మొదటివారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తో తన మొదటి పరిచయం అన్నవరం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందని తెలిపారు. అన్నవరం పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన షూటింగ్ జరుగుతుండగా, డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ను సుమన్ కలిశారట. అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సుమన్ దగ్గరకు వచ్చి, “హాయ్ సుమన్. నువ్వంటే నాకు ఇష్టం. నేను నీ ఫ్యాన్‌ని. నీ కళ్ళు బాగుంటాయి. నీ జయం సినిమా నేను చూశాను” అని అన్నారని సుమన్ తెలిపారు. తాను ప్రేమించే హీరో తనను అభిమానినని చెప్పినప్పుడు కలిగిన ఆనందం వర్ణించలేనిదని సుమన్ పేర్కొన్నారు. ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేని గొప్ప ప్రశంస అని ఆయన అన్నారు. అన్నవరం తర్వాత, పవన్ కళ్యాణే స్వయంగా తనను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పిలిపించి అవకాశం ఇచ్చారని సుమన్ తెలిపారు. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్, సుమన్‌తో “నువ్వు కొంచెం లావు అవుతున్నావు. మంచి ఆర్టిస్ట్‌వి. కొంచెం తగ్గి, బాడీ తగ్గించు, నువ్వు మంచి ఆర్టిస్ట్‌వి సుమన్” అని ఆరోగ్య సలహా కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద హీరోలు తన పట్ల చూపిన అభిమానం, మద్దతు తనకెంతో సంతోషాన్ని ఇచ్చాయని సుమన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

Pawan Kalyan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us