AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ కెరీర్ మార్చిన దర్శకుడు.. ఈ కమెడియన్ తమ్ముడు అని తెలుసా.. ? నెల రోజుల్లోనే ఇద్దరూ చనిపోవడానికి కారణం ఏంటంటే..

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హాస్యనటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. అందులో కమెడియన్ లక్ష్మీపతి ఒకరు. ముఖ్యంగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో పోషించిన వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్స్, కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. కానీ మీకు తెలుసా.. ? లక్ష్మీపతి తమ్ముడు తెలుగులో పెద్ద డైరెక్టర్. ప్రభాస్ కెరీర్ మార్చిన దర్శకుడు ఆయన.

ప్రభాస్ కెరీర్ మార్చిన దర్శకుడు.. ఈ కమెడియన్ తమ్ముడు అని తెలుసా.. ? నెల రోజుల్లోనే ఇద్దరూ చనిపోవడానికి కారణం ఏంటంటే..
Comedian Lakshmipathi
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2026 | 10:58 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు, హాస్య నటుడు లక్ష్మీపతి. ఆ ఒక్కటీ అడక్కు, కితకితలు, అల్లరి, ఎవడి గోల వాడిదే, పెళ్ళాం ఊరెళితే వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. కానీ మీకు తెలుసా.. ? లక్ష్మీపతి తమ్ముడు తెలుగులో పెద్ద డైరెక్టర్. ముఖ్యంగా ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్టు ఇచ్చిన డైరెక్టర్. ఆయన మరెవరో కాదు డైరెక్టర్ శోభన్. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ వర్షం సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్. ఈ మూవీతోనే స్టార్ డమ్ అందుకున్నారు డార్లింగ్. ఇదిలా ఉంటే.. లక్ష్మీపతి, డైరెక్టర్ శోభన్ ఇద్దరూ ఒక నెల రోజుల్లోనే కన్నుమూశారు. గతంలో లక్ష్మీపతి కుమార్తె శ్వేతా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రి, బాబాయ్ ఇద్దరిని ఒకే నెలలో కోల్పోయిన విషాద గాథను పంచుకున్నారు. ఈ అనూహ్య ఘటన తర్వాత ఆమె ఎంతగా కుంగిపోయినా, తన సోదరులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ కోసం ధైర్యంగా నిలబడి, కుటుంబానికి ఆసరాగా మారిన వైనం అందరినీ కదిలిస్తుంది.

బాబాయ్ బాబీ మరణ వార్త తెలిసినప్పుడు శ్వేతా వైజాగ్‌లో రేడియో జాకీగా పనిచేస్తున్నారు. ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఒక రాత్రి ఆఫీసు మిత్రులు ఇంటికి వచ్చి బాబాయ్ బాలేదు అని చెప్పగానే ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. హుటాహుటిన బస్సు పట్టుకొని విజయవాడకు బయలుదేరారు. బస్సులో వస్తున్నప్పుడు తెల్లవారుజామున వార్తాపత్రికలో ప్రముఖ దర్శకుడు శోభన్ హఠాన్మరణం అనే వార్త చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అప్పటివరకు బాబాయ్ ఆసుపత్రిలో ఉన్నారనే భావనతో ఉన్న ఆమెకు, ఆ వార్త ఊహించని షాక్‌నిచ్చింది. బాబాయ్ మరణవార్త పరిశ్రమను కూడా షాక్‌కు గురిచేసింది. మాదాపూర్‌లోని భరత్ ఠాగూర్ కార్యాలయంలో కథా చర్చలో ఉన్నప్పుడే ఆయన అస్వస్థతకు గురై మరణించినట్లు శ్వేతా తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమె బాబాయ్‌ని చూడలేకపోయారు, అప్పటికే ఆయన పార్థివదేహం ఇంటికి తీసుకురాలేదు. అందరూ ఏడుస్తున్నా, ఆమె వెంటనే ఏడవలేకపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నారు.

బాబాయ్ అంత్యక్రియల సమయంలో తండ్రి లక్ష్మీపతి తాగి ఉండటం చూసి శ్వేతా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ రోజు ఆయన బాధలో తాగి ఉన్నా, ఆ పరిస్థితిలో అలా ఉండటం ఆమెకు నచ్చలేదు. సాధారణంగా గొడవపడటానికి ఇష్టపడని శ్వేతా, ఆ రోజు తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరుసటి రోజు వైజాగ్‌కు తిరిగి వెళ్ళిపోయారు. తండ్రి ఆమె చేతిని పట్టుకొని ఏడుస్తున్నా, కోపంతో మాట్లాడలేదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మధ్య గొడవలు చూసి వాయిస్ పెంచడాన్ని ద్వేషించిన శ్వేతా, ఆ రోజు మౌనంగా వెళ్ళిపోయారు. అయితే, ఈ విషాదం ముగియకముందే మరో తీవ్రమైన షాక్ ఆమెను కుంగదీసింది. బాబాయ్ మరణించిన సరిగ్గా నెల రోజులకే, జనవరి 5న బాబాయ్ మరణించగా, ఫిబ్రవరి 5న తన తండ్రి లక్ష్మీపతి కూడా మరణించారు. ఈ రెండు సంఘటనలు ఆమెకు రెండు గుండెలు పెకలించిన విధంగా అనిపించాయని వివరించారు.

రెండు కీలకమైన కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత, శ్వేతా వైజాగ్‌లోనే ఉన్నారు. ఈ సమయంలో ఆమెను ధైర్యంగా నిలబెట్టిన ఒకే ఒక్క కారణం తన తమ్ముడు సంతోష్ శోభన్. అతను అప్పటికి చాలా చిన్నవాడని, తాను కుంగిపోతే అతను ఒంటరి అయిపోతాడని ఆమె భావించారు. బాబాయ్ కుమారులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, అలాగే తన తమ్ముడు – ఈ ముగ్గురి బాధ్యతను తాను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. “మేబీ ఏం అవకుండా ఉన్నానేమో అని నా ఫీలింగ్” అని ఆమె పేర్కొన్నారు. ఈ విధంగా, వ్యక్తిగత విషాదాన్ని దిగమింగుకొని, శ్వేతా తన కుటుంబానికి, ప్రత్యేకించి తన తమ్ముళ్లకు అండగా నిలిచారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

కమెడియన్ లక్ష్మీపతి, డైరెక్టర్ శోభన్..

Lakshmipathi, Shoban

Lakshmipathi, Shoban

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

Follow Us