AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kings Stories: రాజుల కథతో సినిమాలు.. కాసుల వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులు

Kings Stories: రాజుల కథతో సినిమాలు.. కాసుల వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 6:36 PM

Share

చరిత్రలో నిలిచిపోయిన రాజుల జీవితాలు ఇప్పుడు భారీ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయ పాత్రలో కన్నడ స్టార్‌ సుదీప్‌ నటించబోతుండగా, ఛత్రపతి శివాజీగా ‘కాంతారా’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి కనిపించనున్నారు. సుదీప్‌ నటిస్తున్న ‘దేవరాయ’ టీజర్‌ ఇప్పటికే విడుదలైంది. మరోవైపు శివాజీ బయోపిక్‌ను సందీప్‌ సింగ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒకప్పటి రాజుల చరిత్రను సినిమాల రూపంలో నేటి జనరేషన్‌కు అందిస్తున్నారు హీరోలు.. అలాంటి కథలకు డిమాండ్ కూడా బాగా పెరిగిందిప్పుడు. చరిత్రను మార్చేసిన కింగ్స్ కహానీలు తీస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇద్దరు స్టార్ హీరోలు.. అదిరిపోయే రెండు బయోపిక్స్‌తో వస్తున్నారు. ఎవరా హీరోలు.. ఏంటా సినిమాలు..? ఛత్రపతి శివాజీ, శంభాజీ, శ్రీకృష్ణదేవరాయ.. వీళ్లంతా కేవలం వ్యక్తులు కాదు.. ఓ చరిత్రను కదిలించిన ధీరులు. వాళ్ళ హిస్టరీ సినిమాగా తీస్తే బాక్సాఫీస్ దగ్గర హిస్టరీలు క్రియేట్ అవుతున్నాయి. నేటి జనరేషన్‌కు నచ్చేలా VFX జాత చేసి అదిరిపోయే సినిమాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. గతేడాది వచ్చిన ఛావా.. మొన్నొచ్చిన రితేష్ దేశ్‌ముఖ్ శివాజీ సినిమాలు అందుకే అంత పెద్ద విజయం సాధించాయి. తాజాగా శ్రీకృష్ణ దేవరాయ మీద మరో సినిమా రాబోతుంది. మనకు దేవరాయ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆదిత్య 369లో బాలయ్యే.. ఆ పాత్రను అంత బాగా పోషించారాయన. మధ్యలో ఓసారి శ్రీకాంత్ శ్రీకృష్ణదేవరాయగా అలా కనిపించారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు సుదీప్ ఈ పాత్ర పోషించబోతున్నారు. తాజాగా టీజర్ కూడా విడుదలైంది. దేవరాయ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.. దర్శకుడి వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచారు మేకర్స్. మరోవైపు ఛత్రపతి శివాజీ జీవితంపై కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా ఓ భారీ సినిమాను ప్రకటించారు. సందీప్ సింగ్ 500 కోట్లతో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోలు ఒకప్పటి రాజులుగా మారుతుంటే బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా రికార్డ్‌

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Follow Us