Bank Holidays: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..? బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్..
వారం మారితే బ్యాంక్ సెలవులు కూడా మారుతాయి. మీరు బ్రాంచ్‌ను సందర్శించాలని అనుకుంటే సెలవుల గురించి ముందే తెలుసుకోవాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వారంలో రెండో శనివారం రావడంతో బ్యాంకులు ఎక్కువ రోజులు క్లోజ్ కానున్నాయి. ఈ వారం బ్యాంక్ సెలవులు ఇవే..

Bank Holidays
- ప్రతీ వారం బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. దీంతో బ్యాంక్ హాలీడేస్ గురించి ఖాతాదారులు తెలుసుకోవాల్సిన అవసరముంది. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలని ప్లాన్ చేసుకుంటుంటే.. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవుల గురించి ముందే తెలుసుకోవడం ముఖ్యం. రాష్ట్రాలు, స్థానిక పండుగలు ఆధారంగా బ్యాంక్ సెలవుల్లో మార్పులు ఉంటాయి. దీంతో మీ ప్రాంతంలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయనేది తెలుసుకోవాలి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.
- సెప్టెంబర్ 6వ తేదీన ఆదివారం రావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. దీంతో దేశవ్యాప్తంగా ఇవాళ బ్యాంకులు మూసి ఉంటాయి. సెప్టెంబర్ 7 సోమవారం యథావిధిగా బ్యాంకులు ఉంటాయి. సెప్టెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు బ్యాంకులు పని చేస్తాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13వ తేదీన ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
- ఈ వారంలో బ్యాంకులు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 11న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా జైపూర్‌లో బ్యాంకులు బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు భారత్ మండపంలో బ్రిక్స్ బినిసెస్ ఫోరమ్, 18వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దీంతో ఢిల్లీలో సెప్టెంబర్ 11న బ్యాంకులు మూతపడనున్నాయి.
- బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ పనివేళలు వేర్వురుగా ఉంటాయి. కానీ సాధారణంగా 10 నుంచి 4 గంటల వరకు ఉంటాయి. బ్యాంక్ సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. కేవలం చెక్కుల క్లియరెన్స్ సేవలు నిలిచిపోతాయి.
- ఆన్లైన్ ద్వారా యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ విధానాల్లో నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అలాగే ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఆన్లైన్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.
Follow Us





