AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఈ సాంగ్ ఉంటది భయ్యా.. 33 ఏళ్లుగా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న పాట.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్లలో వ్యూస్..

సాధారణంగా తెలుగు సినీ ప్రపంచంలో కొన్ని పాటల క్రేజ్ ఏమాత్రం తగ్గదు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ సాంగ్స్ మాత్రం ప్రతిచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు జెన్ జీ యువతకు సైతం మత్తెక్కిస్తున్న ఒక పాట గురించి మీరు తెలుసుకోవాల్సింది. ప్రస్తుతం యూట్యూబ్ లో 30 మిలియన్స్ పై వ్యూస్ అందుకుని దూసుకుపోతుంది. వింటూంటే మళ్లీ మళ్లీ వింటుంటారు.

Trending Song: ఈ సాంగ్ ఉంటది భయ్యా.. 33 ఏళ్లుగా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోన్న పాట.. ఇప్పటికీ యూట్యూబ్‏లో మిలియన్లలో వ్యూస్..
Gajje Ghallumandiro
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2026 | 8:39 AM

Share

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పాటలు మాత్రం కాలాన్ని జయించి నిలుస్తాయి. దశాబ్దాలు గడిచినా, సంగీత ధోరణులు ఎన్ని మారినా ఆ సాంగ్స్ శ్రోతల గుండెల్లో నిలిచిపోతాయి. అలాగే వాటి మ్యాజిక్ కొంచెం కూడా తగ్గదు. అలాంటి ఒక ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్ మెలోడీ మాస్ సాంగ్ ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చాం. అదేనండీ.. ‘బావ బావమరిది’ చిత్రంలోని “గజ్జె ఘల్లుమన్నదో.. గుండె జల్లుమన్నదో”. 1993లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా, ఇందులోని పాటలు తెలుగు హృదయాలను ఊపేసాయి. సుమన్, మాలశ్రీ జంటగా నటించిన ఈ చిత్రానికి రాజన్-నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా “గజ్జె ఘల్లుమన్నదో” పాటలో ఉన్న నాదస్వరం, డోలు వాయిద్యాల మేళవింపు, ఆకట్టుకునే లయ, సాహిత్యం శ్రోతలను వెంటనే కట్టిపడేస్తాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. సంగీత ప్రియులను ఊపేసే బీట్, వినసొంపైన మెలోడీ కలగలసి ఈ పాటను ఒక మాస్టర్‌పీస్‌గా మార్చాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఈ పాట విడుదలైన రోజుల్లో ఆడియో కేసెట్లు, రేడియోల ద్వారా సంచలనం సృష్టించగా, డిజిటల్ యుగంలోనూ తన హవాను కొనసాగిస్తోంది. యూట్యూబ్‌ను సైతం షేక్ చేస్తుంది. ఇప్పటివరకు 3 కోట్లకు పైగా (31 మిలియన్లకు పైగా) వ్యూస్ సాధించడం విశేషం. ఇప్పటి కుర్రాళ్లు కూడా ఈ పాటను రీల్స్, షార్ట్స్, మరియు డిజే ఈవెంట్లలో ఉపయోగిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సుమన్, మాలశ్రీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, అందమైన గ్రామీణ వాతావరణం, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాట విజయంలో కీలక పాత్ర పోషించాయి. మూడు దశాబ్దాలు గడిచినా కొంచెం కూడా క్రేజ్ తగ్గకుండా, ఇప్పటికీ యూట్యూబ్‌ని షేక్ చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న ఈ క్లాసిక్ సాంగ్ తెలుగు సినీ సంగీత వైభవానికి ఒక నిలువెత్తు నిదర్శనం!

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

‘బావ బావమరిది’ 1993లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కుటుంబ బంధాలు, అపార్థాలు, వినోదాన్ని కలగలిపి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇద్దరు బావబావమరుదుల (కృష్ణంరాజు, సుమన్) మధ్య జరిగే ఈగో పోరాటాలు, ఆప్యాయతలు, వారి కుటుంబాల్లో వచ్చే అపార్థాల చుట్టూ తిరిగే కథ. చిన్న బావమరిదిగా సుమన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. జయసుధ, మాలశ్రీల నటన కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

గజ్జె ఘల్లుమన్నదో సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

Follow Us