AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

Phani CH
|

Updated on: Sep 05, 2026 | 5:38 PM

Share

‘ప్రేమలు’ ఫేమ్‌ దర్శకుడు గిరీష్‌ ఏ.డీ. నుంచి వచ్చిన మరో ప్రేమకథ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్‌’. నివిన్‌ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం సింపుల్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుంది. సహజమైన ప్రేమ, బలమైన పాత్రలు, భావోద్వేగాలు, హాస్యం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. నివిన్‌ పౌలీ నటన, మమితా బైజు పెర్ఫార్మెన్స్‌, విష్ణు విజయ్‌ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్‌గా ప్రేక్షకులకు చల్లని, హృద్యమైన అనుభూతిని ఈ చిత్రం అందిస్తుంది.

ప్రేమలు లాంటి క్లాసిక్ సినిమాను ఇచ్చిన దర్శకుడు గిరీష్ ఏడీ నుంచి వచ్చిన మరో లవ్ స్టోరీ బెత్లెహెం కుటుంబ యూనిట్. నివిన్ పౌలీ, ట్రెండిగ్ బ్యూటీ మమితా బైజు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. విత్ అవుట్ స్పాయిలర్.. ఈ సినిమా కథలోకి వెళితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇష్టం లేకపోయినా వేరే ప్రాంతానికి మకాం మార్చిన కాలేజీ విద్యార్థిని ఆష్లే అలియాస్ మమితా బైజు. తన పాత పరిచయాలను, వాతావరణాన్ని వదిలేసి రావడం వల్ల తీవ్రమైన అసంతృప్తితో ఉంటుంది. ఆమె ఉంటున్న ఇంటి పక్కనే జస్టిన్ అలియాస్ నివిన్ పాలి ఉంటాడు. అతడు ఆష్లే కంటే వయసులో 12 ఏళ్లు పెద్దవాడు. కేటరింగ్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. తన గతంలో జరిగిన ఒక చేదు సంఘటనను మనసులోనే దాచుకుని, బయటకు కనిపించకుండా ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? చుట్టుపక్కల వాళ్ల ప్రభావం, ఎదురైన సంఘటనలు వీరి బంధాన్ని ఏ తీరానికి చేర్చాయి..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది సమస్యగా మారిందా లేదా అనేదే ఈ చిత్ర కథ.. టెక్నికల్ అంశాలు, బడ్జెట్, భారీతనం కంటే ప్రేక్షకుల మనసుకు హత్తుకునే భావోద్వేగాలే..ఓ సినిమాను నిలబెడతాయని దర్శకుడు గిరీష్ ఏ.డి మరోసారి నిరూపించాడని చెప్పాలి. ప్రేమ అనేది అప్పటికప్పుడు పుట్టే ఆకర్షణలా కాకుండా, ఓ విత్తనం పడే రోజు నుంచి అది పువ్వులా మారేంత సున్నితంగా, సహజంగా చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ప్రతి పాత్రకు ఒక లోతైన, బలమైన నేపథ్యం ఉంటుంది. ఇందులో ఎవరూ పూర్తిగా మంచివాళ్లు లేదా చెడ్డవాళ్లు కారు, వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్లుగా ప్రవర్తించే మామూలు మనుషులే. ఒక చిన్న పట్టణం నేపథ్యాన్ని దర్శకుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఇరుగుపొరుగు ఇళ్లు, అక్కడి చర్చి, వీధులు అన్నీ మన కళ్ల ముందు నిజంగా జరుగుతున్న ఫీలింగ్ ఇస్తాయి. ముఖ్యంగా ఆష్లే కనిపించకుండా పోయినప్పుడు వెతకడం, ఆ తర్వాత కారులో ఇద్దరూ కలిసి ప్రయాణించడం, గొడవ పడటం, మళ్లీ కలిసిపోవడం… ఈ ఎపిసోడ్ మొత్తం చాలా హృద్యంగా సాగుతుంది. ఇక ప్రపోజల్ సీన్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. కాలేజీ వార్షికోత్సవంలో జరిగే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. సంభాషణల్లోని పంచ్‌లు బాగా పేలాయి. అయితే అక్కడక్కడా కొన్ని మైనస్‌లు లేకపోలేదు. జోయెల్ ప్రియురాలి అన్నయ్య క్యారెక్టర్ కథలో అంతగా ఇమడలేదు. అలాగే వినయ్ ఫోర్ట్ చిన్న పాత్ర, పదే పదే వచ్చే మద్యపాన సన్నివేశాలు కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. ఏళ్ల కిందట వచ్చిన కమల్ హాసన్ ‘పున్నగై మన్నన్’ ఛాయలు ఉన్నప్పటికీ, తనదైన ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌తో ఆ లోపాన్ని కవర్ చేసి ప్రేక్షకులను సరికొత్త మ్యాజిక్‌లోకి తీసుకెళ్లడంలో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే బెత్లెహెం కుటుంబ యూనిట్ బెస్ట్ ఛాయిస్.. జస్టిన్ పాత్రలో నివిన్ పాలి నటన సినిమాకే హైలైట్. మగాళ్లలోని సిగ్గును తెరపై క్యూట్‌గా, సహజంగా చూపించాడు. తన వయసుకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో, చచ్చిపోయిన భావాలను మళ్లీ బతికించుకునే క్రమాన్ని అద్భుతంగా పండించాడు. పాత జ్ఞాపకాలను వదులుకోలేక సతమతమయ్యే యువతిగా, అల్లరి పిల్లగా, సున్నితమైన ప్రేమలో పడిన అమ్మాయిగా మమితా బైజు తన పాత్రలో జీవించేసింది. తమ్ముడు జోయెల్‌గా సంగీత్ ప్రతాప్, స్నేహితుడిగా సురేష్ కృష్ణ, మామగా వినయ్ ఫోర్ట్ తమ పరిధి మేరకు చక్కగా నటించి సినిమాకు బలం చేకూర్చారు. ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ.. ఆ స్థాయిలో విష్ణు విజయ్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాత్రలు మాట్లాడని చోట మ్యూజిక్ మాట్లాడింది. అజ్మల్ సాబు కెమెరా పనితనం పల్లెటూరి అందాలను, పాత్రల మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. ఆకాష్ వర్గీస్ ఎడిటింగ్ చాలా నీట్‌గా సాగింది. ఆష్లీ గిటార్ తీగలకు, జస్టిన్ అగ్గిపుల్ల గీసే విధానానికి ముడిపెడుతూ వాళ్ల క్యారెక్టరైజేషన్‌ను సింబాలిక్‌గా చూపించిన తీరు సాంకేతిక నిపుణుల ప్రతిభకు అద్దం పడుతుంది. కమర్షియల్ హంగుల మధ్య ఒక స్వచ్ఛమైన, చల్లని అనుభూతిని ఈ చిత్రం పంచుతుంది. దర్శకుడు గిరీష్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడు.. ప్రేమలు తర్వాత మంచి కథతో వచ్చాడు.ఓవరాల్‌గా బెత్లెహెం కుటుంబ యూనిట్.. సింపుల్ అండ్ బ్యూటీఫుల్..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramba Urvasi Menaka Review: చాలా రోజుల తర్వాత అల్లరోడి మార్క్‌ కామెడీ.. నవ్వించాడా? బోర్ కొట్టించాడా?

I’m Game Review: సగం గెలిచాడు.. సగంలో ఓడాడు..! హిట్టా..? ఫట్టా..?

Mirzapur Review: మున్నా భయ్యా ఈజ్ బ్యాక్! హిట్టా..? ఫట్టా..?

పాత డీజిల్ వాహనదారులకు శుభవార్త

హైదరాబాద్ – విజయవాడ హైవే ఇక 6 లేన్స్! ట్రాఫిక్ జామ్‌లకు గుడ్‌బై..

Published on: Sep 05, 2026 05:37 PM
Follow Us