AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash's Toxic Movie: టాక్సిక్ ముంచేసింది.. ఆశలన్నీ రావణుడిపైనే

Yash’s Toxic Movie: టాక్సిక్ ముంచేసింది.. ఆశలన్నీ రావణుడిపైనే

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 6:39 PM

Share

‘టాక్సిక్‌’ ఫ్లాప్‌తో రాకింగ్‌ స్టార్‌ యశ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమాతో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఆశలన్నీ నితీష్‌ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’పైనే ఉన్నాయి. ఇందులో రావణుడిగా నటించడంతో పాటు నిర్మాతగానూ యశ్‌ వ్యవహరిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ యశ్‌ కెరీర్‌కు కీలకంగా మారింది. సినిమా ఫలితం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మామూలుగా ఓ పెద్ద సినిమా పోతే స్టార్ హీరోలకు పెద్దగా నష్టమేం ఉండదు.. మళ్లీ హిట్ కొడితే పరిస్థితి మామూలే. కానీ యశ్‌కు మాత్రం అలా లేదు సిచ్యువేషన్. ఈయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ బిజీగా ఉన్నారు. దాంతో ఫ్లాప్ వస్తే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. టాక్సిక్ ముంచేయడంతో.. రావణుడిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు రాకింగ్ స్టార్. మరి రామాయణ ఎలా ఉండబోతుంది..? టాక్సిక్ అనే ఒక్క సినిమాతో చాలా మంది జాతకాలు మారిపోయాయి. ఈ సినిమాతో ఇండియన్ రికార్డులు తిరగరాయాలని బయల్దేరిన యశ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫస్ట్ డే నుంచే టాక్ తేడాగా రావడంతో రెండో రోజుకే ఈ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అనేది ట్రేడ్‌కు అర్థమైపోయింది. అయితే టాక్సిక్‌లో యశ్ కేవలం హీరో మాత్రమే కాదు.. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు. యశ్ లాంటి స్టార్ హీరోకు ఓ సినిమా పోతే పెద్దగా పోయేదేం లేదు.. మరో హిట్ కొడితే అంతకంటే ఎక్కువే సంపాదిస్తారు.. ఇమేజ్ కూడా వస్తుంది. కానీ నిర్మాతగానూ టాక్సిక్ ఈయన్ని బాగా దెబ్బకొట్టేలా కనిపిస్తుంది. కంటెంట్ మీద నమ్మకంతో KVNతో కలిసి నిర్మించారు యశ్. ఇప్పుడేమో సీన్ రివర్స్ అయిపోయింది. ప్రస్తుతం యశ్ ఆశలన్నీ రామాయణపైనే ఉన్నాయి. రామాయణకు కూడా యశ్ ఓ నిర్మాత. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ 1లో రావణుడిగా నటిస్తున్నారు యశ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్ ఉన్నా.. రామాయణకు ఫేస్ ఆఫ్ ది మూవీగా ఉన్నది మాత్రం యశ్శే. దివాళికి సినిమా విడుదల కానుంది. ఇది హిట్టైతే.. టాక్సిక్‌తో పోయింది ఇక్కడ సంపాదించుకుంటారు. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా రికార్డ్‌

El Nino Warning: ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పొంచి ఉన్న పెను ముప్పు

డ్రైవర్ల కోసం కేంద్రం కొత్త వ్యవస్థ! ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే లైసెన్స్‌ పాయింట్లు కట్‌

గంటలు తరబడి బురదలోనే 91 ఏళ్ల వృద్ధురాలు.. తలను పైకి ఉంచి ప్రాణాలతో బయటపడి

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

Follow Us