వివాదంలో అలీ వ్యాఖ్యలు.. నువ్వెవడివి.. కోన్ కిస్కా..!

| Edited By: Anil kumar poka

Oct 23, 2019 | 11:16 AM

టాలీవుడ్‌లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ రివ్యూ రైటర్లపై వివక్ష నడుస్తూ వస్తోంది. తమ సినిమాలకు మంచి రేటింగ్ ఇవ్వని రివ్యూ రైటర్లపై సినీ ఇండస్ట్రీ వాళ్లు ఫైర్ అవుతున్నారు. ఇది వరకు హీరోలు సహా దర్శకులు రివ్యూ రైటర్లపై కామెంట్లు చేశారు. వారి కోసం మేము సినిమా తీయం. సినిమాపై అవగాహన లేని చాలామంది రివ్యూ రైటర్ల అవతారమెత్తుతున్నారు అంటూ పలు కామెంట్లు చేశారు. ఇక తాజాగా కమెడియన్ అలీ కూడా రివ్యూ రైటర్లపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు […]

వివాదంలో అలీ వ్యాఖ్యలు.. నువ్వెవడివి.. కోన్ కిస్కా..!
Follow us on

టాలీవుడ్‌లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ రివ్యూ రైటర్లపై వివక్ష నడుస్తూ వస్తోంది. తమ సినిమాలకు మంచి రేటింగ్ ఇవ్వని రివ్యూ రైటర్లపై సినీ ఇండస్ట్రీ వాళ్లు ఫైర్ అవుతున్నారు. ఇది వరకు హీరోలు సహా దర్శకులు రివ్యూ రైటర్లపై కామెంట్లు చేశారు. వారి కోసం మేము సినిమా తీయం. సినిమాపై అవగాహన లేని చాలామంది రివ్యూ రైటర్ల అవతారమెత్తుతున్నారు అంటూ పలు కామెంట్లు చేశారు. ఇక తాజాగా కమెడియన్ అలీ కూడా రివ్యూ రైటర్లపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశాడు. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసేది.. ప్రేక్షకుల కోసం.. వాళ్లెవరు సినిమాను డిసైడ్ చేయడానికి గొట్టం గాళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అయితే ఓంకార్ తెరకెక్కించిన రాజుగారిగది 3 సినిమా ఈ మధ్యే విడుదలైన విషయం తెలిసిందే. అందులో అలీ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ అంటూ రాజుగారిగది 3పై రివ్యూ రైటర్స్ విమర్శల వర్షం కురిపించాడు. అంతటితో ఆగకుండా రివ్యూవర్లను నమ్ముకుని తామేం ఇండస్ట్రీకి రాలేదని.. ప్రేక్షకులను నమ్ముకుని వచ్చామని.. వాళ్లే తమను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. సినిమా చూసి ప్రేక్షకులు సరైన తీర్పు చెబుతారని.. మధ్యలో రివ్యూ రైటర్స్ ఎక్స్ ట్రాలు చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనకు రివ్యూల మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్లే ప్రెస్ షోలు చూడట్లేదని అలీ అన్నాడు.

దీనిపై రివ్యూ రైటర్లు ఫైర్ అవుతున్నారు.. ‘‘ఓ చిన్న సినిమా విడుద‌లైన‌పుడు అది బాగుంద‌ని రాస్తే.. రివ్యూ రైట‌ర్లు గొప్పోళ్లు అయిపోతారు. మా సినిమాకు ఇంత రేటింగ్ వ‌చ్చిందని.. ఇచ్చార‌ని గొప్ప‌గా వాళ్లే పోస్ట‌ర్ల‌పై వేసుకుంటారు. కానీ బాగలేని సినిమాకు త‌క్కువ రేటింగ్ ఇస్తే మాత్రం వాళ్ల‌కు సినిమా చూడ‌టం రాదు.. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసింది అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారు.. విమ‌ర్శిస్తుంటారు అని కొందరు రివ్యూ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రివ్యూ నిజంగా అంత ప్రభావం చూపిస్తే.. అప్పుడు తామిచ్చిన రేటింగ్స్ కూడా పోస్టర్స్‌పై వేసుకోకూడదు కదా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అలీ వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో వివాదం కొనసాగుతోంది.