Director Sandeep Raj: ఆ కల నెరవేరదేమో.. బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చోమో.. కలర్ ఫోటో డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..

దర్శకుడిగా సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. బిగ్ స్క్రీన్ పై తన పేరును చూసుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ సినీప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లను దాటుకుని సక్సెస్ కావడం అంత సులభమేమి కాదు.

Director Sandeep Raj: ఆ కల నెరవేరదేమో.. బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చోమో.. కలర్ ఫోటో డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్..
Sandeep Raj

Updated on: Dec 09, 2025 | 4:10 PM

డైరెక్టర్ సందీప్ రాజ్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దర్శకుడిగా తొలి చిత్రానికి జాతీయ అవార్డ్ అందుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు కావాలని సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించిన సందీప్ రాజ్.. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కరోనా లాక్ డౌన్ సమయం కావడంతో కలర్ ఫోటో చిత్రం ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో సుహాస్, చాందిని హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ మూవీ తర్వాత గుడ్ లక్ సఖి, ముఖచిత్రం వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు. అలాగే సీతారామంతోపాటు మరికొన్ని సినిమాల్లో నటుడిగా కనిపించారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమో మోగ్లీ. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా నటిస్తుంది. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు వాయిదా వేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 12న అఖండ 2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు మోగ్లీ సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ సందీప్ రాజ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలకు నాకన్నా మరో డైరెక్టర్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అన్నీ బాగానే జరిగే సమయంలో రిలీజ్ విషయంలో దురదృష్టం ఎదురుపడుతుంది. ఇందులో కామన్ పాయింట్ నేనే. బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చేమో.. “Directed by Sandeep Raj” అనే పేరును పెద్ద తెరపై చూడాలన్న కల రోజు రోజుకీ కష్టమవుతుంది. అయినప్పటికీ మోగ్లీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మోగ్లీ సినిమాను అంకితభావంతో ఉన్న అభిరుచి, చెమట, రక్తంతో రూపొందించాము. కనీసం వారి కోసమైనా ఈ సినిమాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సందీప్ రాజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..