‘మెగాస్టార్’‌కి చిరంజీవి విషెస్‌

మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇవాళ 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి

మెగాస్టార్‌కి చిరంజీవి విషెస్‌

Edited By:

Updated on: Sep 07, 2020 | 4:25 PM

Chiru wishes Mammootty: మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇవాళ 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు మొదలు రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మమ్ముట్టికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

”హ్యాపీ బర్త్‌డే మమ్ముట్టి. ఈ అద్భుత ఇండస్ట్రీలో నీతో పాటి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. ఇన్ని రోజులు నువ్వు చేసిన సినిమాలు, ఘనత అభిమానులకు గొప్ప నిధి లాంటింది. దాన్ని వారు ఎప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఇలాగే మరిన్ని సంవత్సరాలు నువ్వు అభిమానులు ఎంటర్‌టైన్ చేస్తుంటావని ఆశిస్తున్నా” అని కామెంట్ పెట్టారు.

Read More:

సర్‌ప్రైజ్‌లు ఉంటాయి‌: ‘రాధేశ్యామ్’ దర్శకుడి ఆసక్తికర ట్వీట్

Bigg Boss 4: గంగవ్వకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శుభాకాంక్షలు