AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా ఫోర్జరీ కేసు

సుశాంత్ కేసులో కొత్త మలుపు ! అతని సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ  మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశాంత్ ని ఆసుపత్రిలోని  ఔట్ పేషంట్  విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తిగా చూపుతూ...

సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై రియా ఫోర్జరీ కేసు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 07, 2020 | 4:10 PM

Share

సుశాంత్ కేసులో కొత్త మలుపు ! అతని సోదరి ప్రియాంక సింగ్ పై రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. ఈ  మేరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశాంత్ ని ఆసుపత్రిలోని  ఔట్ పేషంట్  విభాగంలో చికిత్స పొందుతున్న వ్యక్తిగా చూపుతూ ప్రియాంక, ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డాక్టర్ తరుణ్ కుమార్ బోగస్ (ఫోర్జరీ) ప్రిస్క్రిప్షన్ తయారు చేశారని ఆమె ఆరోపించింది. నిజానికి అప్పుడు సుశాంత్ జూన్ 8 న ముంబైలో ఉన్నాడని రియా వెల్లడించింది. ఆ రోజున సుశాంత్ కి, అతని సోదరికి మధ్య సాగిన వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా రియా ఈ ఫిర్యాదు చేసింది. ఆ రోజునే తాను సుశాంత్ ఇంటినుంచి తమ ఇంటికి వెళ్లిపోయానని ఆమె పేర్కొంది.

ఆ చాట్ ను బట్టి చూస్తే …వారం రోజులపాటు ‘లైబ్రియం’  టాబ్లెట్ ను, ప్రతి రోజూ ‘ నె క్సిట్’  మాత్రలను వేసుకోవాలని ప్రియాంక కోరిందట..  ఇది డిప్రెషన్ తగ్గడానికి అని చెప్పిందట.. వాస్తవానికి అది ఫోర్జరీ చేసిన ప్రిస్క్రిప్షన్ అని రియా చక్రవర్తి ఆరోపించింది.   దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us