వెంకీ , బాలయ్యను ఆలోచనలోకి నెట్టేసిన మెగాస్టార్ చిరు.. ఆచార్య వాయిదాతో..

|

Apr 29, 2021 | 5:55 AM

ముందనుకున్నట్లు మే నెలలో రాలేకపోతున్నాం... మరో డేట్ త్వరలో చెబుతాం అంటూ సైలెంట్ గా సైడ్ ఇచ్చుకుంది ఆచార్య మూవీ. ఈ విధంగా... మిగతా సీనియర్ హీరోలను ఆలోచనలోకి నెట్టేశారు మెగాస్టార్ చిరూ

వెంకీ , బాలయ్యను ఆలోచనలోకి నెట్టేసిన మెగాస్టార్ చిరు.. ఆచార్య వాయిదాతో..
Chiranjeevi Twitter
Follow us on

ముందనుకున్నట్లు మే నెలలో రాలేకపోతున్నాం… మరో డేట్ త్వరలో చెబుతాం అంటూ సైలెంట్ గా సైడ్ ఇచ్చుకుంది ఆచార్య మూవీ. ఈ విధంగా… మిగతా సీనియర్ హీరోలను ఆలోచనలోకి నెట్టేశారు మెగాస్టార్ చిరు. ఇంతకీ… వెంకీ, బాలయ్య ఏం చేయబోతున్నారు? ఇప్పుడొచ్చిన కోవిడ్ గ్యాప్ వాళ్ళకు మైనస్ అవుతుందా? లేక ప్లస్ అవుతుందా?

వందరోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసి ప్రోడక్ట్ చేతికివ్వాలి.. అర్థమవుతోందా అని మెగాస్టార్ అప్పట్లో ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కొరటాలకు ఇప్పటిదాకా గుచ్చుకుంటూనే వుంది. ఎవ్రిథింగ్ ఓకే… అని ఆచార్య టీజర్ ని, పాటను కూడా రిలీజ్ చేసినా… సినిమా విడుదల విషయంలో వెనక్కు తగ్గక తప్పలేదు. చిరూను మరో సినిమాకు వదిలిపెట్టి.. తను తారక్ ప్రాజెక్టుని టేకప్ చేద్దామన్న కొరటాల కలర్ ఫుల్ డ్రీమ్స్ ప్రస్తుతానికి పెండింగ్ లో పడ్డట్టే. ఇప్పుడైతే మళ్ళీ ఆచార్య ఫినిషింగ్ టచెస్ మీద మోర్ ఫోకస్ పెట్టబోతున్నారు కొరటాల
వెంకీ కూడా తన లైనప్ లో లిటిల్ చేంజెస్ చేస్తున్నారు. దృశ్యం సీక్వెల్ ని డిజిటల్ రెలీజ్ కి ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యిందా? అయితే, పుకార్లను నమ్మకండి… ఏదైనా ఉంటే నేనే చెబుతానన్నారు ప్రొడ్యూసర్ సురేష్ బాబు . అటు…నారప్ప అవుట్ ఫుట్ ని పర్సనల్ గా మోనిటర్ చేస్తున్న సురేష్ బాబు.. కొంత కరెక్షన్ చెప్పారని.. రీషూట్ తప్పదని తెలుస్తోంది. ఈ లెక్కన నారప్ప రిలీజ్ కోసం మరో మూడు నెలలు ఆగినా ఆగుతారెమో! అప్పటివరకూ వెంకీని లైమ్ లైట్ లో ఉంచడానికి దృశ్యం2 ఉండనే ఉంది.
రీసెంట్ గా టైటిల్ ఖరారు చేసి.. సెకండ్ టీజర్ తో రికార్డులు బద్దలు కొడుతున్న అఖండ మూవీ ప్రోగ్రెస్ కూడా కంప్లిషన్ స్టేజ్ లోకి రానేలేదు. మే 28న విడుదల అనే డెసిషన్ కొన్ని ప్రెజర్స్ తోనే వచ్చింది కనుక.. ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోడానికి బీబీ3 టీమ్ కి ఎటువంటి ఇబ్బందీ లేదు. పైగా ఈ సినిమాను కూడా సింహా రేంజ్ లో తీర్చిదిద్దడానికి మరికొంత సమయం దొరికిందని రిలాక్స్ అవుతున్నారట బోయపాటి. సో.. అఖండది కూడా వాయిదా రూటేనన్నమాట!

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట… ( వీడియో )