చిరు సంచలన నిర్ణయం.. రేపటి నుంచి ఫ్యాన్స్‌కి పండగే..!
మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 64 ఏళ్ల వయసులోనూ తన నటనతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోన్న చిరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేందుకు సిద్ధమయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 64 ఏళ్ల వయసులోనూ తన నటనతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోన్న చిరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను సోషల్ మీడియాలో రాబోతున్నానని ఆయన అన్నారు. ”ఇక నుంచి తాను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాను. దానికి కారణం నా భావాలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవడానికి.. తాను అనుకున్న మెసేజ్‌లను ప్రజలతో చెప్పడానికి అది వేదికగా భావిస్తూ అందులోకి ఎంటర్ అవ్వబోతున్నాను. ఉగాది రోజు నుంచి తాను సోషల్ ఫ్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాను ” అని వివరించారు. అయితే ఏఏ ఫ్లాట్‌ఫాంలోకి తాను రాబోతున్నానన్న దానిపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు.
కాగా ఇప్పటికాలంలో అభిమానులతో దగ్గరగా ఉండేందుకు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అక్కడ తమ సినిమాలకు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చాటింగ్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చిరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికైనా మెగాస్టార్ సోషల్ మీడియాలో రాబోతున్నట్లు ప్రకటించడంతో మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తారు…? మొదటి పోస్ట్ ఏం చేస్తారు..? అన్న ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. కాగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు. కాజల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్, సోనూసూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లకు స్వస్తి.. ఎప్పటివరకంటే..?