అనసూయ ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు..!

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 31వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలు విఙ్ఞప్తి చేశాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:15 pm, Mon, 23 March 20
అనసూయ ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు..!

కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 31వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాలు విఙ్ఞప్తి చేశాయి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లాక్‌ డౌన్ పరిస్థితిని అర్థం చేసుకుని.. తమకు సహకరించండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌కు యాంకర్, నటి అనసూయ స్పందించారు.

”సర్ ప్రభుత్వం మీద గౌరవంతో మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ మాలాంటోళ్లు బయటకు వెళ్లకపోతే.. డబ్బులను సంపాదించడం కష్టం. అలాగని ఇంటి రెంట్, పవర్ బిల్‌, ఈఎంఐ తదితర ఖర్చులను మేము భరించాల్సి ఉంటుంది. మాలాంటి వారి ఇబ్బందులను కాస్త పట్టించుకోండి” అని ట్వీట్ చేశారు. దానిపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ప్రాణాలు పోతుంటే డబ్బులు ముఖ్యమా..? ఏంటి మీకే డబ్బులు లేవా..? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నలు కురిపించారు. ఈ నేపథ్యంలో వారందరికీ సమాధానం ఇచ్చిన అనసూయ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నెటిజన్లు అలాగే స్పందిస్తుండటంతో.. ఆమె సమాధానం చెప్తూ పలువురు నెటిజన్లను బ్లాక్ చేశారు. ఇక కొందరేమో అనసూయకు మద్దతును తెలుపుతూ ట్వీట్లు చేశారు. వారికి సైతం సమాధానం ఇచ్చిన అనసూయ.. తను చెప్పిన దాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే ట్వీట్లతో అనసూయ వివాదాల్లో ఉండటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆమె చేసిన పలు ట్వీట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also:  కరోనాపై యుద్ధం.. నితిన్ ముందడుగు.. హీరోపై ప్రశంసలు..!