Chiranjeevi: మరోసారి సంచలనంగా మారిన చిరు ట్వీట్‌.. రాజకీయాలను ఉద్దేశిస్తూ డైలాగ్‌ పోస్ట్‌..

|

Sep 29, 2022 | 3:24 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌....

Chiranjeevi: మరోసారి సంచలనంగా మారిన చిరు ట్వీట్‌.. రాజకీయాలను ఉద్దేశిస్తూ డైలాగ్‌ పోస్ట్‌..
Chiranjeevi Tweet Viral
Follow us on

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించడంతో హిందీలోనూ గాడ్‌ఫాదర్‌పై మంచి బజ్‌ ఏర్పడిందని చెప్పాలి. నయనతార తొలిసారి చిరంజీవికి సిస్టర్‌ రోల్‌లో నటిస్తుండడం విశేషం. ఇలా ఎన్నో పాజిటివ్‌ అంశాలతో వస్తోన్న ఈ సినిమాకు అదే స్థాయిలో పాజిటివ్ బజ్‌ ఏర్పడింది. అక్టోబర్‌ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌ ఫిక్సయ్యారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించే ముందు మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేసిన ఓ ఆడియో ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రాజకీయాలకు నేను దూరంగా ఉండొచ్చు. కానీ నాకు రాజకీయాలు ఎప్పుడూ దూరం కాలేదు’ అని చిరు చెప్పిన ఒక్క డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. మెగా స్టార్‌ ఈ డైలాగ్‌ను తన రాజకీయ జీవితానికి సంబంధించి చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఇది గాడ్‌ ఫాదర్‌ సినిమాలో డైలాగ్‌ అని ఆ తర్వాత అర్థమైంది. దీంతో రాజకీయ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో ఇలాంటి మరిన్ని డైలాగ్స్‌ ఉంటాయని చెప్పకనే చెప్పారు మెగాస్టార్‌.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిరు గాడ్‌ ఫాదర్‌ చిత్రానికి సంబంధించి మరో డైలాగ్‌ను షేర్‌ చేసుకున్నారు. డైలాగ్‌ రైటర్‌ లక్ష్మీ భూపాల్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసిన చిరు.. అతనిపై పొగడ్తలు కురిపించారు. ‘మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్ముతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక సినిమా నుంచి మరో డైలాగ్‌ను సైతం చిరు ట్వీట్ చేశారు. ఇక డైలాగ్‌ విషయానికొస్తే ఇది కూడా రాజకీయాలను టార్గెట్‌ చేస్తూనే ఉండడం విశేషం. దీంతో ఈ ట్వీట్‌ కూడా వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..