మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరు ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నాడు. దీనిని మోహన్ రాజా డైరెక్షన్ చేయనున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉండగా… ఈ రెండు సినిమాలతోపాటే మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ చేయనున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చిరు వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. తాజాగా చిరు మరో సినిమాను చేయనున్నట్లుగా తెలిపాడు.
చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ చిత్రీకరణలో పాల్గోననున్నాడు. ఈ చిత్రం తర్వాతా వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మెగాస్టార్ డైరెక్టర్ బాబీతో కలిసి సినిమా చేయనున్నట్లుగా ప్రకటించాడు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఉప్పెన మూవీ ప్రీరీలజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరు ఈ విషయాన్ని చెప్పాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో చిరంజీవి, బాబీ కాంబోలో సినిమా రాబోతుంది.
Megastar @KChiruTweets garu & @dirbobby with @MythriOfficial ?
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021
Also Read: చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ రేసులో తమిళ డైరెక్టర్.. స్క్రిప్ట్‌లో పలు మార్పులు.. ఆ పాత్ర ఉండదా..!