AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, ప్రభాస్ సినిమా టైటిళ్లు ఇవేనా..!

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇంతవరకు టైటిల్‌పై మాత్రం స్పష్టత రాలేదు. ఆ మధ్య ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని టైటిళ్లు బయటకు వచ్చాయి. వివిధ నిర్మాణ సంస్థలు తమ వద్ద […]

చిరు, ప్రభాస్ సినిమా టైటిళ్లు ఇవేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 08, 2020 | 3:45 PM

Share

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపుగా ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇంతవరకు టైటిల్‌పై మాత్రం స్పష్టత రాలేదు. ఆ మధ్య ఈ సినిమాకు జాన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. వాటిని చిత్రయూనిట్ ఖండించింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని టైటిళ్లు బయటకు వచ్చాయి. వివిధ నిర్మాణ సంస్థలు తమ వద్ద రిజిస్టర్ చేయించుకున్న టైటిళ్లను ఫిలిం ఛాంబర్ విడుదల చేసింది. అందులో యూవీ క్రియేషన్స్ పేరిట ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిళ్లు ఉన్నాయి. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రభాస్ కోసమన్న టాక్ నడుస్తోంది. అలాగే మేర్లపాక గాంధీ, సుజీత్‌లతో కూడా యూవీ క్రియేషన్స్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆచార్య అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. దీంతో ఈ టైటిల్ చిరంజీవి-కొరటాల చిత్రం కోసమేనని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే టైటిల్‌ను పెట్టానుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. ఇప్పుడు ఆచార్యను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో చిరు 152వ చిత్రం టైటిల్ ఆచార్య అని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. కాగా ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us
శని దెబ్బకు.. వీరికి అగ్నిపరీక్ష.. ఇక వాయింపే వాయింపు
శని దెబ్బకు.. వీరికి అగ్నిపరీక్ష.. ఇక వాయింపే వాయింపు
పేరెంటింగ్‌లోనూ GenZల కొత్త పద్ధతులు
పేరెంటింగ్‌లోనూ GenZల కొత్త పద్ధతులు
చీమకు ఎన్ని పళ్లు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ విషయం తెలియదు
చీమకు ఎన్ని పళ్లు ఉంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ విషయం తెలియదు
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో అప్డేట్.. వారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో అప్డేట్.. వారికి శుభవార్త
ఇదెంట్రా బాబు.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ రచ్చ..
ఇదెంట్రా బాబు.. థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ రచ్చ..
గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటంటే..
గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు మోగిస్తారు? ఆ దైవ రహస్యం ఏంటంటే..
8 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచిన హైదరాబాద్ యువ కెరటాలు
8 వికెట్లతో రాజస్థాన్ నడ్డి విరిచిన హైదరాబాద్ యువ కెరటాలు
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
ఏపీలో తిరిగే టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొత్త ఛార్జీలు
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
జర భద్రం.. ఈ రంగు కార్లుకొంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కవ
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..
కోడి పుంజు అదోలా అరుస్తూ కనిపించింది.. ఏంటని తొంగి చూడగా..