AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా అంత వాడు లేడంటూ.. విర్రవీగడం కాదు! మెగాస్టార్‌కు తనదైన స్టైల్లో ఉత్తేజ్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యతరగతి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి సుప్రీమ్ హీరోగా, ఆపై మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి. ఈ సందర్భంగా నటుడు ఉత్తేజ్ తనదైన శైలిలో చిరంజీవికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

నా అంత వాడు లేడంటూ.. విర్రవీగడం కాదు! మెగాస్టార్‌కు తనదైన స్టైల్లో ఉత్తేజ్ విషెస్
Chiranjeevi Birthday Uttej Wishes
SN Pasha
|

Updated on: Aug 22, 2026 | 5:38 PM

Share

ఆగస్టు 22.. ఇది కేవలం ఒక తేదీ కాదు. కోట్ల మంది సినీ అభిమానులకు పండుగ రోజు. తెలుగు సినిమాను తన నటనతో, డ్యాన్స్‌తో దశాబ్దాల పాటు శాసించిన ఓ జీవి పుట్టిన రోజు. ఆయన మరెవరో కాదు అని పరిచయం చేయాల్సిన అక్కర్లేని వ్యక్తి. ఎస్.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అనేలా.. శివ శంకర వర ప్రసాద్ అనే మధ్యతరగతి కుర్రాడు చిరంజీవిగా.. సుప్రీమ్ హీరోగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన తీరు ఒక అద్భుతం. ఆయన సినిమాలు, నటన, డ్యాన్స్ మాత్రమే కాదు.. ఆయన జీవిత ప్రయాణం, ఆయన వ్యక్తిత్వం కూడా ఎందరికో స్ఫూర్తి. ఈ రోజు ఆయన 71వ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపార. అలాగే నటుడు ఉత్తేజ్ సైతం తనదైన శైలిలో మెగాస్టార్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన రాసిన బర్త్ డే విషెస్ మీ కోసం..

అన్నయ్యా ,

పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆకర్షణీయంగా ఎదగడం,

ఆలోచింపచేసేలా నడుచుకోవడం,

అనుసరించేలా ప్రవర్తించడం పేరే

” చిరంజీవి “

శివ్ ఖేరా అన్నట్టు

మేధావులు విభిన్నమైన

పనులు చేయరు,

చేసే పనిని విభిన్నంగా చేస్తారు..

ఆ విభిన్నతలోంచే,

ఆ సృజనాత్మకలోంచే,

ఆ సామర్థ్యం లోంచే

వచ్చిన శక్తి పేరు

” చిరంజీవి “

గుంపులో కాకుండా,

గుంపు వెనుకకాకుండా,

గుంపులో కలవకుండా,

తనదైన ముద్రని సాధించిన పిడికిలి

పేరే..” చిరంజీవి “

విశ్రాంతులు పట్టని,

వాయిదాలు వేయని,

వివాదాల తావివ్వని,

నిత్య వికాసుడి

పేరే..” చిరంజీవి “

50,60 ల పైబడ్డ వాళ్ళకి

మనమేం చేస్తున్నాం,

ముసలితనమనే

వంకలతో ..సొల్లుకబుర్లతో , పనికిరాని వేదాంతాలతో ఆవులిస్తున్నామేంటి..

అంటూ ఆలోచించుకునేలా

కన్పిస్తూ, వీపున చరిచి

అదిలిస్తూ దర్శనమిచ్చే మార్గదర్శి పేరే..” చిరంజీవి “

కాలాన్ని జయిస్తూ,

ఉరకలెత్తే వేగంతో

పరుగులు పెడుతూ..

విరామమెరుగని వ్యాయామాలతో ..

విద్యుద్వేగంతో కదం తొక్కుతూ..పుట్టుకతో

వృద్ధులైన యువకులందరికీ

చెంపపెట్టులా..

పరిశ్రమించే కర్మశీలి

పేరే ” చిరంజీవి “

తనని ప్రేమించే

అభిమానించే అభిమానులు సైతం,

శహభాష్ అన్పించుకునేలా

ఎదిగినప్పుడు,

లోకం మిమ్మల్ని మెచ్చినప్పుడు మాత్రమే

నాకు ఆనందమంటూ

గుండెనిండా తండ్రితనాన్ని నింపుకున్న

అవ్యాజగుణం

పేరే ” చిరంజీవి “

ఎదగడం అంటే

నాఅంత వాడు లేడంటూ

విర్రవీగడం కాదు

అంతకంత ఒదుగుతూ

విశాలంగా పరుచుకోవడం ..

చెట్టు తన కొమ్మల చేతులతో మరో చెట్టు

కొమ్మల్ని పలకరించినట్టు,

సహచరుడిలా సాగుతూ

అణువణువునా

మనిషితనంతో

ప్రవహించే

విశ్వమానవుడి

పేరే ” చిరంజీవి “

అన్నయ్యా ..

నిండు నూరేళ్లూ

ఇలాగే…సంతోషంగా

ఉంటూ..మమ్మల్ని సంతోషపెడుతూ….

ఉండాలని ,

ఆ ప్రకృతి మాతని

కోరుకుంటూ …

Love you..

మీరు మా పండుగ

మీరు మా అదృష్టం

Follow Us