శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవే పక్కన ఉన్న భారీ మర్రిచెట్టుకు ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. చెట్టు సమీపంలో హనుమాన్ దేవాలయం ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక కుట్ర కోణంలో జరిగిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.