తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. దాదాపు రూ.25 లక్షల విలువైన 24 చోరీ బైక్లను స్వాధీనం చేసుకుని, ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడిన ఈ ముఠా సభ్యులపై పలు కేసులు నమోదై ఉన్నాయి.