గన్నవరం సమీపంలోని కేశరపల్లిలో భర్త నరేంద్ర వివాహేతర సంబంధం బట్టబయలైంది. ఉద్యోగం పేరుతో మరో మహిళతో సహజీవనం చేస్తున్న నరేంద్రను భార్య ప్రియాంక బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆగ్రహంతో భర్తకు దేహశుద్ధి చేసిన ప్రియాంక, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.