Mahesh Sarkaru Vaari paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ సర్కారు వారి పాట. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చినప్పుడే.. సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్ వినోద్‌ని ప్రకటించింది యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి వినోద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట కంటే ముందు వినోద్, పవన్ కల్యాణ్ నటిస్తోన్న వకీల్ సాబ్‌ని ఒప్పుకున్నారు. కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి వకీల్ సాబ్ షూటింగ్ పూర్తై, ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేది. కానీ కరోనా రావడంతో షూటింగ్‌లకు బ్రేక్ పడగా, ఇప్పుడిప్పుడే సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి.
ఈ క్రమంలో త్వరలోనే సర్కారు వారి పాట షూటింగ్‌ను మొదలుపెట్టాలని పరశురామ్ భావించారు. అంతేకాదు ఇందుకోసం అమెరికా వెళ్లి లొకేషన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు పవన్ వకీల్ సాబ్ కూడా ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటుంది. దీనికి సంబంధించి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే పెండింగ్‌లో ఉండగా. . అంతవరకు మహేష్ మూవీని వెయిట్ చేయించడం మంచిది కాదని భావించిన వినోద్, సర్కారు వారి పాటను వదులుకున్నారట. ఈ క్రమంలో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్.మధిని మహేష్ టీమ్ రంగంలోకి దింపినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకటి పాన్ బోకర్‌గా మరొకటి బ్యాంక్ ఆఫీసర్ అని తెలుస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ భామ విద్యాబాలన్, మహేష్ సోదరిగా కనిపించబోతున్నట్లు టాక్. ఇక మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించబోతున్నారు.
Read More:
Tamannaah: తమన్నాకు కరోనా.. హైఫీవర్‌తో బాధపడుతున్న మిల్కీబ్యూటీ