Central government : తమిళనాడు ప్రభుత్వనికి షాక్ ఇచ్చిన కేంద్రం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందన్న హోంశాఖ..

|

Jan 07, 2021 | 7:32 AM

తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది.   తమిళనాడులోని సినిమా థియేటర్లలో 100శాతం సీట్ల సామర్థ్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించడమే...

Central government : తమిళనాడు ప్రభుత్వనికి షాక్ ఇచ్చిన కేంద్రం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుందన్న హోంశాఖ..
Follow us on

Central government : తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. తమిళనాడులోని సినిమా థియేటర్లలో 100శాతం సీట్ల సామర్థ్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించడమే అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు సీఎస్‌కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా బుధవారం లేఖ రాశారు. నవంబరు 25న ఇచ్చిన విపత్తు నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని కేంద్రం పేర్కొంది. ఇక థియేటర్స్ లో 100 శాతం సీటింగ్ అంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది వైద్యనిపుణులతో పాటు ఐసీఎమ్మార్‌ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రదీప్‌కౌర్‌ కూడా వ్యతిరేకించారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..

High Court Of Telangana: నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ హిమా కోహ్లీ..