Tollywood: పూజ గదిలో ధ్యానం చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పట్టుదలకు, ధైర్యానికి ప్రతిరూపం..

పైన ఫొటోలో ధ్యానం చేస్తున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? పరిస్థితులు ఎలాంటివైనా.? కాలం ఎంత పగబట్టినా.? మొండిగా ముందుకు సాగుతోందీ హీరోయిన్‌. జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతోందీ..

Tollywood: పూజ గదిలో ధ్యానం చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పట్టుదలకు, ధైర్యానికి ప్రతిరూపం..
Guess The Actress

Updated on: Mar 12, 2023 | 6:20 PM

పైన ఫొటోలో ధ్యానం చేస్తున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? పరిస్థితులు ఎలాంటివైనా.? కాలం ఎంత పగబట్టినా.? మొండిగా ముందుకు సాగుతోందీ హీరోయిన్‌. జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతోందీ బ్యూటీ. స్టార్‌ హీరోయిన్‌గా హోదా, పెద్ద కుటుంబంలోకి కోడలిగా ఎంట్రీ. కానీ అంతలోనే అనుకోని పరిస్థితులు. ఓవైపు వైవాహిక జీవితంలో ఇబ్బందులు, మరోవైపు ఆరోగ్యం పరంగా ఇబ్బందులు. ఇప్పటికే ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారు కదూ! అవును మీరు అనుకుంటోంది నిజమే. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార సమంతే.

మయోసైటిస్‌తో బాధపడుతోన్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తోంది. ఆరోగ్య సమస్యలతో పోరాడి కోలుకుంటోంది. అప్పట్లో స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించిన సమంత ప్రస్తుతం దైవారాధనలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా లింగ భైరవిదేవి అమ్మవారి ఎదుట ధ్యానం చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది ససమంత. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఫొటోతో పాటు.. ‘జీవితంలో నమ్మకమే ప్రధానమైన బలం. దీనికి అతీంద్రియ శక్తి అవసరం లేదు. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు.. నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ బ్యూటీ.

సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. సమంతకు మద్ధతుగా పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌లో సిడెట్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. తెలుగులో నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..