Vishal Kirti about Sushant: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతిపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులు పలువురు నటి రియాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆమె వలనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, సుశాంత్‌ని రియానే చంపిందని, సుశాంత్‌ని రియా బ్లాక్ మెయిల్ చేసిందని పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ బావ విశాల్ కిర్తి(శ్వేతా సింగ్ కిర్తి భర్త) రియాపై ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ఓ బ్లాగ్‌లో సుశాంత్ విషయాలను పంచుకుంటూ వస్తోన్న విశాల్.. తాజాగా రియాపై కామెంట్లు చేశారు. ”2019లో రియా, సుశాంత్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా బావమరిదితో పెద్దగా కాంటాక్ట్‌లో లేను. శ్వేతను పెళ్లి చేసుకోకముందు నుంచే నాకు సుశాంత్ తెలుసు. 1997 నుంచి 2007 వరకు మేము మంచి స్నేహితులం. 2007 నుంచి మేము కుటుంబ సభ్యులం అయ్యాము. 2007 నుంచి 2019 వరకు తరచుగా మేము మెసేజ్‌లు చేసుకునే వాళ్లము. తరచుగా కలిసే వాళ్లం” అని రాసుకొచ్చారు. కాగా సుశాంత్ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు, తాజాగా రియాకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read More:
ప్రియురాలిని పెళ్లాడబోతున్న శర్వా!
I don’t know a lot of details myself and I am hoping that the CBI Enquiry will fully enlighten us eventually. https://t.co/gajkWmadIz #JusticeForSushantSinghRajput #JusticeForSushant #CBIInMumbai #GayatriMantra4SSR #GlobalPrayersForSSR
— vishal kirti (@vikirti) August 23, 2020