Brahmanandam : హ్యాపీ బర్త్ డే కామెడీ కింగ్.. న‌వ్వేజ‌నా సుఖినోభ‌వంతు.. బ్రహ్మానందం పుట్టినరోజు ప్రత్యేకం..

|

Feb 01, 2021 | 5:41 AM

Brahmanandam Birthday Special: బ్రహ్మానందం ఈ పేరు ఏ క్షణాన పెట్టారో కానీ ఇప్పటికి ఆనందం పంచుతూనే ఉన్నారు. కామెడీకి బ్రాండ్ అంబాసిడర్‌గా

Brahmanandam : హ్యాపీ బర్త్ డే కామెడీ కింగ్.. న‌వ్వేజ‌నా సుఖినోభ‌వంతు.. బ్రహ్మానందం పుట్టినరోజు ప్రత్యేకం..
Follow us on

Brahmanandam Birthday Special: బ్రహ్మానందం ఈ పేరు ఏ క్షణాన పెట్టారో కానీ ఇప్పటికి ఆనందం పంచుతూనే ఉన్నారు. కామెడీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. నవ్వుల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్నారు. ఐదేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకు బ్రహ్మానందం పేరు వినబడుతుంది. పల్లెలో అయినా పట్నంలో అయినా, బాధలో అయినా సంతోషంలో అయినా, పనిలో అయినా పాటలో అయినా ఆయన పేరు వినబడితే చాలు పెదాలపై చిరునవ్వు ఇట్టే వస్తోంది. దటీజ్ బ్రహ్మానందం. తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటుూ కొన్ని పేజీలు లిఖించుకున్న హాస్యనటుడు. ఇవాళ ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

కన్నెగంటి ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేశారు. ఆయన మొదటి సినిమా జంద్యాల గారి’అహానా పెళ్లంటా’ సినిమా తీయడానికి ముందు అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. అహానా పెళ్ళంట సినిమాతర్వాత బహ్మానందం కామెడీ రారాజుగా మారిపోయారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకించి పాత్రను రాసుకునేవారు. పాత్ర ఏదైనా బ్రహ్మనందం అందులో జీవించే వారు అనడంలోఅతిశయోకిత్తి లేదు. అందులో కొన్ని పాత్రలు ప్రేక్షకులు మరిచిపోలేరు.

ఎప్పుడో రెండున్నర ద‌శాబ్దాల క్రితం ఇదిగో ఇలాంటి డైలాగుల‌తోనే అర‌గుండు వేసుకొని తెగ న‌వ్వించాడు బ్రహ్మానందం. అప్పటి నుంచీ ఆ న‌వ్వుల జోరూ. బ్రహ్మీ హోరూ కొన‌సాగుతూనే ఉంది. అర‌గుండు, ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్‌, మెక్‌డోల్డ్ మూర్తి, భ‌ట్టు, గ‌చ్చిబౌలి దివాక‌ర్, ప‌ద్మశ్రీ‌, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య ఇలా బ్రహ్మీ ఏ రూపంలో వ‌చ్చినా జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వారు. పొట్టలు చెక్కలు చేసుకొన్నారు. త‌న‌ న‌వ్వుల‌తో ద‌శాబ్దాల నుంచి వినోదాల వైద్యం చేస్తున్న డాక్టర్ ఆయ‌న‌. చ‌రిత్ర దేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు.. కానీ బ్రహ్మానందం చ‌రిత్ర.. చిరిగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు. అది సువ‌ర్ణాక్షరాల‌తో లిఖించ‌బ‌డింది. అందుకే ఎన్నో అవార్డులు వ‌రించాయి. ప‌ద్మశ్రీ కూడా వెతుక్కొంటూ ఆయన చెంత వాలింది. ఇవాళ 65వ పడిలోకి అడుగుపెడుతున్న బ్రహ్మానందం ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం. మరిన్ని సినిమాల్లో నటించి నవ్వించాలని కోరుకుందాం.

#DilRaju : దిల్ రాజు బర్త్ డే పార్టీలో మెరిసిన యావత్ తెలుగు ఇండస్ట్రీ.