Watch! రేఖ 68 ఏళ్లలోనూ అప్సరసే.. పట్టుచీరతో ఈ క్వీన్‌ను చూసి నేటికీ ఆస్పరసే అంటున్న ఫ్యాన్స్..

నుదుటి మీద సింధూరం దిద్దుకుని... జుట్టుని ముడివేసుకుని.. ఆ కొప్పు చుట్టూ మల్లెలు ముడుచుకుని చేతిలో పొట్లీ బ్యాగ్ , మ్యాచింగ్ బ్యాంగిల్స్ తో కనిపించిన రేఖను చూసి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అంత అద్భుతంగా రేఖ ఉంది. ఈ కార్యక్రమంలో రేఖ చాలా స్టైలిష్ స్టైల్‌లో గోల్డెన్ ఫుల్ స్లీవ్స్ సూట్‌తో ఆఫ్ వైట్ చీరను ధరించింది. రేఖ ఆ చీరను ధోతీలాగా ధరించి చీరకు మ్యాచింగ్ బంగారు నగలను ధరించింది.

Watch! రేఖ 68 ఏళ్లలోనూ అప్సరసే.. పట్టుచీరతో ఈ క్వీన్‌ను చూసి నేటికీ ఆస్పరసే అంటున్న ఫ్యాన్స్..
Rekha Video Viral

Updated on: Sep 14, 2023 | 11:43 AM

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు.. అయితే తాను ఈ మాటకు భిన్నం అని నిరూపించింది సోగకళ్ళ సుందరి రేఖ. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు చేరుకున్న రేఖ.. బాలీవుడ్ క్వీన్ .. కుర్రాళ్ల కలల రాణి.. భానురేఖ గణేశన్ .. తల్లి దండ్రుల నటనను వారసత్వంగా తీసుకుని వెండి తెరపై అడుగు పెట్టింది. మొదట దక్షిణాదిలో నటించిన రేఖ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కలర్ తక్కువని రిజెక్ట్ చేసిన చోటే స్టార్ హీరోయిన్ గా అందలం అందుకుంది. రేఖ ఈ పేరు వింటే చాలు అప్పట్లో కుర్రకారు గుండె చప్పుడు పెరిగేది.. దేవతాసుందరిగా ఆరాధించేవారు. ఆరుపదుల వయసులో ఉన్న కూడా రేఖని నేటికీ ఆరాధించేవారున్నారు.
అప్పటి నుంచి ఇప్పటికీ ఈ కళ్లలో మెరుపుని వినోదాన్ని ఆరాధించే వేలమంది ఉన్నారు. రేఖ శైలి, రేఖ నవ్వు, రేఖ చూపుని నేటికీ చూపరుల గుండెల్లో మెరుపులు మెరిపిస్తాయి. అందుకు ఉదాహరణగా నిలిచింది తాజాగా సంఘటన. గ్లోబల్ స్పా అవార్డ్స్ 2023లో రేఖ రెడ్ కార్పెట్‌పైకి ప్రవేశించినప్పుడు… అందరూ రేఖని చూస్తూ ఉండిపోయారు. రేఖ చాలా స్టైలిష్‌గా పట్టు చీర సూట్‌ ధరించి.. ఫ్యాషన్ విషయంలో తాను ఎప్పుడు ఓ ట్రెండ్ అని చెప్పకనే చెప్పేసింది. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రేఖ దుస్తులను హ్యాండిల్ చేస్తూ కనిపించారు.

నుదుటి మీద సింధూరం దిద్దుకుని… జుట్టుని ముడివేసుకుని.. ఆ కొప్పు చుట్టూ మల్లెలు ముడుచుకుని చేతిలో పొట్లీ బ్యాగ్ , మ్యాచింగ్ బ్యాంగిల్స్ తో కనిపించిన రేఖను చూసి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అంత అద్భుతంగా రేఖ ఉంది. ఈ కార్యక్రమంలో రేఖ చాలా స్టైలిష్ స్టైల్‌లో గోల్డెన్ ఫుల్ స్లీవ్స్ సూట్‌తో ఆఫ్ వైట్ చీరను ధరించింది. రేఖ ఆ చీరను ధోతీలాగా ధరించి చీరకు మ్యాచింగ్ బంగారు నగలను ధరించింది. పట్టు వస్త్రాలతో ఉన్న రేఖను చూసి ఎవరైనా సరే అప్సరస శాపవశాత్తు దివి నుంచి భువికి దిగి వచ్చిందేమో అని అనిపించకమానదు ఎవరికైనా..

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

68 ఏళ్ల వయసులో రేఖ అప్సరే..

68 ఏళ్ల వయసులో కూడా రేఖ తన అందంతో పిచ్చెక్కిస్తోంది. రేఖ కనిపించగానే కెమెరాలన్నీ ఆమె వైపు తిరిగాయి. ఫోటో గ్రఫర్స్ కూడా రేఖ అందాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎగబడ్డారు. అదేవిధంగా.. ఒక క్రేజీ ఫోటోగ్రాఫర్ రేఖతో ఫోటో తీసుకోవాలని చూసినప్పుడు రేఖ చాలా ప్రేమగా అతని చెంపను కొట్టింది.

రేఖను చూసి పిచ్చెక్కిపోయిన అభిమానులు

ఈ వీడియో సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. రేఖ ఈ స్టైల్ చూసి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రేఖ సింప్లిసిటీని, ఆమె స్టైల్‌ని అభిమానులు కొనియాడుతున్నారు. రేఖ టచ్ చేసిన ఈ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో అని ఒక వినియోగదారు రాశారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

షారుఖ్-దీపిక కూడా రేఖకు ఫ్యాన్స్

ఈ సంవత్సరం ప్రారంభంలో రేఖ ఒక టీవీ షో ‘గమ్ హై కిసీ కే ప్యార్ మే’ ప్రచార వీడియోలో కనిపించింది. ఇటీవల వోగ్ అరేబియా జూలై/ఆగస్టు 2023 సంచిక కవర్ పేజీపై మనీష్ మల్హోత్రా దుస్తులను ధరించి రేఖ కనిపించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె , షారుఖ్ ఖాన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ అందరూ రేఖకు అభిమానులే. రేఖ తన నటన, డ్యాన్స్, సాంప్రదాయ శైలితో అభిమానులను మాత్రమే కాదు ఎవరినైనా సులభంగా ఆకర్షిస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..