Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

|

Mar 18, 2022 | 2:55 PM

Kashmir Files: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కశ్మీర్‌ పండిట్లపై (Kashmiri Pandits) జరిగిన దాడులు, వలసలు ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. 1990లో కశ్మీర్‌ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా..

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..
The Kashmir Files
Follow us on

Kashmir Files: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కశ్మీర్‌ పండిట్లపై (Kashmiri Pandits) జరిగిన దాడులు, వలసలు ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. 1990లో కశ్మీర్‌ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు అగ్నిహోత్రి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుతున్నాయి. చివరికీ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా స్పందించడంతో ఈ సినిమాకు భారీ హైప్‌ వచ్చింది. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఏకంగా రూ. వంద కోట్ల మార్క్‌ కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రికి భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివేక్‌కు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో ఈ భద్రతను అందించాలని సమాచారం. ఇందులో భాగంగా ఈ దర్శకుడికి మొత్తం 8 మంది అధికారులు భద్రత అందించనున్నారు, వీరిలో ఇద్దరు కమాండోస్‌తో పాటు మిగతా వారు పోలీసులు ఉండనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.

Also Read: Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

Holi 2022: హోలీ ఆడేముందు ఈ  పనులు చేయండి.. చర్మం.. కళ్లపై పడకుండా  ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Holi 2022: హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవాలనుకుంటే.. ఈ 4 చిట్కాలను అనుసరించండి..