Sushmita Sen: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజూకు లక్షల సంఖ్యలో ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఇక పలు ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో నిత్యం వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణిని వేగవంతం చేసింది ప్రభుత్వం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల పాటు మిని లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఒక వైపు కరోనా మరణ మృదంగం మోగిస్తుండగా.. అక్కడి కాలుష్యానికి ప్రజలు పిట్టల్ల రాలిపోతున్నారు. ఈ కష్టతర పరిస్థితులలో ప్రజలకు సాయం చేయడానికి పలువురు సెలబ్రెటీలు సైతం ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ కరోనా రోగులకు సాయం అందిండానికి ముందుకు వచ్చింది. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు నేను సిద్ధం అంటూ ట్వీట్ చేసింది. ఇక ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు సుస్మితాను ట్రోల్ చేస్తూ.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవపల ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి దిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్ సుస్మిత పై సెటైర్ వేశాడు. ‘ఆక్సిజన్ కొరత అన్నిచోట్ల ఉన్నప్పుడు ముంబయిలో ఉన్న ఆస్పత్రులకు సాయం అందించకుండా దిల్లీలోని వాటికే ఎందుకు సాయం చేస్తున్నారు?’ అని ఆమెని ప్రశ్నించాడు. దీంతో అసహనానికి గురైన సుస్మిత.. ‘ఎందుకంటే, నాకు తెలిసినంత వరకు ముంబయిలో ఆక్సిజన్ కొరత అంతగా లేదు. ప్రస్తుతం దిల్లీలోని ఎన్నో ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అవసరం ఉంది. ముఖ్యంగా చిన్న ఆస్పత్రులకు. కాబట్టి మీరు సాయం చేయగలిగితే చేయండి’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
Also Read: Anasuya: చిన్నపిల్లగా మారిపోయిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ధీటుగా స్పందించిన రంగమ్మాత్త..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి.. షాక్లో చిత్రపరిశ్రమ…