ఇటీవల తిరుమలలో ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌ను కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఈ చర్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. పవిత్ర తిరుమల క్షేత్రంలో ఇటువంటి పనులేంటని హిందూ వాదులు మండిపడ్డారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ జంట ఇలాగే వివాదంలో చిక్కుకుంది. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన అమీషా పటేల్, హీరో సన్నీ డియోలో సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారాలో రొమాన్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం వీరిద్దరూ గదర్-2 సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా కొన్ని సన్నివేశాలను గురుద్వారాలో తెరకెక్కించారు. అయితే అమీషా, సన్నీలు కౌగిలించుకోవడం, ముద్దుల పెట్టుకోవడం వంటి సీన్లు కూడా ఇక్కడే చిత్రీకరించినట్లు వీడియోలు బయటకు రావడంతో సిక్కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచకులలోని గురుద్వారా శ్రీ కుహ్ని సాహిబ్ నిర్వాహకులు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరిస్తామంటూ చిత్రబృందం అనుమతి తీసుకుందన్నారు. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు తీయడం లేదని కూడా తనతో చెప్పారని మేనేజర్ తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు వారు క్షమాపణలు చెప్పాలని గురుద్వారా నిర్వాహకులు, సిక్కలు ఉడిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..