
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటి సుహానీ భట్నాగర్ మృతి చెందారు. ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. ఈ చిన్నది అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ లో నటించింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురుగా సుహానీ భట్నాగర్ నటించింది. దంగల్ తర్వాత సుహానీ భట్నాగర్ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆమె మరణ వార్త విని బాలీవుడ్ షాక్ కు గురైంది. సుహానీ భట్నాగర్ ఫరీదాబాద్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కన్నుమూసిందని తెలుస్తోంది. దంగల్ సినిమాతో పాపులారిటీ సంపాదించి తన బబ్లీ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది సుహానీ. ఆమె గత కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది.
ఇటీవలే ఓ యాక్సిడెంట్ లో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆమె చికిత్స కోసం మందులు కూడా తీసుకుంటోంది. కానీ మందుల రియాక్షన్ వల్ల ఆమె కాళ్లుఇంఫెక్షన్యి అయ్యిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం దెబ్బతిని మరణించిందని తెలుస్తోంది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్రౌండా శ్మశాన వాటికలో సుహానీ భట్నాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సుహానీ భట్నాగర్ 11 సంవత్సరాల వయస్సులో అమీర్ ఖాన్ చిత్రం దంగల్‌లో బబితా ఫోగట్ పాత్రలో కనిపించిం. అలాగే బాపు సేహత్ లియే తూ తో హానికాక్ హై అనే సినిమాలోని పాపులర్ పాటలో కూడా కనిపించింది. సుహానీ భట్నాగర్ అమీర్‌ఖాన్‌తో సహా చాలా మంది పెద్ద స్టార్స్‌తో కలిసి పని చేసింది. అయితే ఆ తర్వాత ఆమె లైమ్‌లైట్‌కు దూరంగానే ఉండిపోయింది. ఆమె సోషల్ మీడియాలో కూడా ఉంది కానీ నవంబర్ 2021 నుండి యాక్టివ్‌గా లేదు. ఇప్పుడు ఆమె మరణ వార్త బాలీవుడ్ లో విషాదం నింపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.