Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్‌ చేశాడో తెలుసా..?

|

Apr 17, 2021 | 2:22 PM

Covid-19 - Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్‌ చేశాడో తెలుసా..?
Sonusood
Follow us on

Sonu Sood – Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డాడు. రియల్‌ హీరో సోనూసూద్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేసి వెల్లడించాడు. ఆయన కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్‌ వేలాది మందికి ప్రత్యేక్షంగా సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. శనివారం మధ్యాహ్నం తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు సోనూసూద్ ట్విట్ చేశాడు.

”నాకు ఈ రోజు ఉదయం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లాను. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాను. బాధపడకండి.. మీ సమస్యలను పరిష్కరించడానికి నాకు తగినంత సమయం లభించింది. నేను మీ అందరి కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని గుర్తుంచుకోండి” అంటూ ట్విట్‌ చేశారు.