ఇటీవల సినీ పరిశ్రమలో బయోపిక్ చిత్రాల హావా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవిత కథలకు సంబంధించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మరికొందరు తారలు, ప్రముఖుల జీవిత కథలను చిత్రీకరించే పనిలో ఉన్నారు మేకర్స్. అటు యుద్ధానికి సంబంధించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్లో కార్గిల్ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా జీవితాధరంగా షేర్షా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటించగా.. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో పరం వీర్ చక్ర అవార్డు గ్రహీత విక్రమ్ బాత్రా జీవితం, ప్రయాణానికి సంబంధించిన విషయాలను షేర్షా సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ ప్రొడక్షన్ బ్యానర్ దర్మ ఎంటర్టైన్మెంట్, క్యాష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆగస్ట్ 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విజయ్ దివాస్ సందర్భంగా విడుదల చేశారు.
షేర్షా చిత్రం.. యుద్ధ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విక్రమ్ బాత్రా యుద్ధం కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అలాగే విక్రమ్ పాత్రలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దేశంకోసం పోరాటము.. మరో వైపు ప్రేమ రెండింటిని విక్రమ్ ఎలా సమన్వయం చేశారనేది ఈ మూవీలో చూడవచ్చు. ఇక షేర్షా ట్రైలర్ పై బాలీవుడ్ తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒత రీల్ హీరో.. నిజమైన హీరోకి ఏ నివాళి ఇవ్వగలడు. మీ త్యాగం మా జీవితానికి స్పూర్తినిచ్చింది. పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా. నా పుట్టిన రోజును మీతో పంచుకున్నందుకు గౌరవంగా ఉందని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
ట్వీట్..
What tribute can a reel hero give to a real hero. Except that your sacrifice inspired us for life, Param Vir Chakra Awardee Captain Vikram Batra! Honoured to share my birthday with you. Sharing the trailer of #Shershaah,the story of your heroic sacrifice.https://t.co/XZpmNSvYsM
— Akshay Kumar (@akshaykumar) July 25, 2021
అలాగే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావమ్, అలియా భట్, కరీనా కపూర్, జాన్వీకపూర్.. షేర్షా ట్రైలర్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.
ట్వీట్స్..
Oh my God! What a lovely trailer. Cannot wait to see this inspiring story of our Kargil war hero ?
Congratulations @SidMalhotra @Advani_Kiara @karanjohar @apoorvamehta18 and the entire team of Shershaah, cannot wait to watch this one☀️☀️???https://t.co/Dq2aJiNIAs
— Alia Bhatt (@aliaa08) July 25, 2021
ట్రైలర్..
Also Read: Dhanya Ramkumar: సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు.. ప్రముఖ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్గా ..