ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ హిట్ గా నిలిచింది బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ సినిమా. ఇండియాలో ఇప్పటిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదు. వాటిలో పఠాన్ ఒకటి. యష్‌రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ పఠాన్. బేషరమ్ పాట విడుదలైనప్పటి నుంచే జనాలను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్లను దాటి కలెక్ట్ చేసింది. ఇప్పటికే చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది పఠాన్. జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా షారుక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు వందకోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పఠాన్ సినిమాకి షారుఖ్ ఏకంగా రెమ్యూనరేషన్ సినిమా ప్రాఫిట్ లో లాభాలు కలిపి 200 కోట్ల వరకు అర్జించినట్లుగా తెలుస్తోంది.
పఠాన్ సినిమా లాభాల్లో 60 శాతం షేర్ ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా డీల్ సెట్ చేసుకున్నారట. ఈ నేపథ్యంలో పఠాన్ సినిమాకి రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా షారుఖ్ ఖాన్ తీసుకున్నారట. దాంతో ఆయన పఠాన్ సినిమాకు ఏమగా 200కోట్ల వరకు ఆర్జించారని తెలుస్తోంది. దాంతో ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా షారుక్ ఖాన్ నిలిచారు.