Shah Rukh Khan Health: షారుఖ్ ఖాన్ హెల్త్ అప్‏డేట్.. ఆసుపత్రిలో చేరడానికి కారణం అదే..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్, అబ్రరామ్, సుహానా, అనన్య, షానయాతో కలిసి హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా షారుఖ్ కోల్ కతా నైట్ రైడర్స్ సహా యాజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‏లలో షారుఖ్ సందడి చేస్తుంటాడు.

Shah Rukh Khan
Follow us

|

Updated on: May 23, 2024 | 6:57 AM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బుధవారం స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‏కు హాజరైన షారుఖ్ డీహైడ్రేషన్ (వడదెబ్బకు) గురయ్యారు. దీంతో ఆయనను అహ్మదాబాద్‏లో కేడీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం షారుఖ్ డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. షారుఖ్ తన హెల్త్ గురించి ట్విట్టర్ వేదికగా క్లారిటీ వచ్చింది. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యాడని.. ప్రస్తుతం బాద్ షా ఆరోగ్యం మెరుగుపడిందని.. అలాగే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. షారుఖ్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ట్వీట్ అనంతరం అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాద్ షా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్‏కు హాజరయ్యారు షారుఖ్.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు షారుఖ్ తన భార్య గౌరీ ఖాన్, అబ్రరామ్, సుహానా, అనన్య, షానయాతో కలిసి హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా షారుఖ్ కోల్ కతా నైట్ రైడర్స్ సహా యాజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‏లలో షారుఖ్ సందడి చేస్తుంటాడు.

గతేడాది షారుఖ్ బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. జవాన్, పఠాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఆ తర్వాత డంకీ సినిమాతోనే అదే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో బాద్ షా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించనున్నాడని టాక్. అయితే కింగ్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా

ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..

డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం..కోన వెంకట్ ఏమన్నారో తెలుసా?

మహేష్ అతిథి మూవీ హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిందేంటీ..

DSC 2024 అభ్యర్ధులకు కీలక అప్‌డేట్.. ఇవాళ్టితో ముగుస్తున్న గడువు

ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్మథనం..

ఐస్ క్రీం బిజినెస్.. ఎంత లాభం వస్తుందో తెలుసా..?

మీ కారు బ్యాటరీ పాడైందని చెప్పే సంకేతాలు ఇవే.. చెక్ చేసుకోండి..

'కల్కి' ఈవెంట్‌లో ప్రెగ్నెంట్ దీపికకు సాయం చేసిన ప్రభాస్.. వీడియో

తొలకరితో పులకరింత.. పాలధారలా పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతాలు