AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: వజ్రాల నెక్లెస్‏తో మెరిసిపోయిన ప్రియాంక చోప్రా.. ధర తెలిస్తే గుండెలు ఆగిపోవాల్సిందే..

అటు హాలీవుడ్.. ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఓ ఈవెంట్లో మెరిసిన పీసీ అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పీసీ. ఇక ఆమె నెక్లెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే..

Priyanka Chopra: వజ్రాల నెక్లెస్‏తో మెరిసిపోయిన ప్రియాంక చోప్రా.. ధర తెలిస్తే గుండెలు ఆగిపోవాల్సిందే..
Priyanka Chopra
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2024 | 7:19 AM

భారతీయ సినీ ప్రపంచంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా చాలా ప్రత్యేకం. బీటౌన్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన పీసీ.. ఇప్పుడు హాలీవుడ్ ను ఏలేస్తుంది. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యింది. అటు హాలీవుడ్.. ఇటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఓ ఈవెంట్లో మెరిసిన పీసీ అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పీసీ. ఇక ఆమె నెక్లెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇటీవల ప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ బల్గారి 140వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు సినీ ప్రముఖులు, ఫ్యాషన్ డిజైనర్స్ హాజరయ్యారు. ఇక ఇదే సెలబ్రేషన్లలో ప్రియాంక సందడి చేసింది. తన బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలకు ప్రియాంక సర్పెంటి ఏటర్నా నెక్లెస్ ధరించింది. ఇప్పుడు ఆ నెక్లెస్ ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. జ్యువెలరీ హౌస్ ప్రకారం పీసీ ధరించిన నెక్లెస్ లో 140 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. ఈ నెక్లెస్ పూర్తి చేయడానికి దాదాపు 2800 గంటల సమయం పట్టిందట. 20 క్యారెట్ల కంటే ఎక్కువ బరువున్న వజ్రాన్ని ఏడు పియర్ ఆకారంలో కత్తిరించారు. ఈ వజ్రాలు 61.81 క్యారెట్ల బరువుతో 698 బాగెట్ డైమంట్స్ కలిపి సిన్యుయస్, త్రీ డైమెన్షనల్ వేవ్ స్ట్రక్చర్ లో సెట్ చేశారు. మొత్తం 140 క్యారెట్ల బరువు ఉంటుందని సమాచారం. ఓ నివేదిక ప్రకారం ఈ నెక్లెస్ ధర విలువ రూ.372 కోట్లు ఉంటుందట.

బల్గారికి సంబంధించిన అటెలియర్స్‌లో రూపొందించబడిన అత్యంత విలువైన ఆభరణాలలో ఈ నెక్లెస్ ఒకటి. ఈ వేడుకలలో పీసీ డెల్ కోర్ డిజైన్ కు చెందిన క్రీమ్, బ్లాక్ గౌన్ ధరించి మరింత అందంగా కనిపించింది. ఇక ఆమె ధరించిన సర్పెంటి ఏటర్నా నెక్లెస్ మరింత అట్రాక్షన్ అయ్యింది. ప్రస్తుతం పీసీ జీలే జరా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by BVLGARI Official (@bvlgari)

View this post on Instagram

A post shared by Patty Cardona (@jerryxmimi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం-సీఎం చంద్రబాబు
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్..
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే