Dunki Movie: ఫ్యాన్స్‌కు దీపావళి ట్రీట్‌ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌ కొత్త స్నేహితులను చూశారా?

|

Nov 12, 2023 | 6:45 AM

2023 సంవత్సరం షారుఖ్ ఖాన్‌కు చాలా కలిసొచ్చిందని చెప్పవచ్చు . కోవిడ్‌కి ముందు వరుసగా పరాజయాలతో షాక్‌కు గురైన షారుఖ్ ఖాన్‌కు 2023 మాత్రం డబుల్‌ ధమాకా ఇచ్చింది. ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Dunki Movie: ఫ్యాన్స్‌కు దీపావళి ట్రీట్‌ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ బాద్‌ కొత్త స్నేహితులను చూశారా?
Dunki Movie
Follow us on

2023 సంవత్సరం షారుఖ్ ఖాన్‌కు చాలా కలిసొచ్చిందని చెప్పవచ్చు . కోవిడ్‌కి ముందు వరుసగా పరాజయాలతో షాక్‌కు గురైన షారుఖ్ ఖాన్‌కు 2023 మాత్రం డబుల్‌ ధమాకా ఇచ్చింది. ఈ ఏడాది అతను నటించిన రెండు సినిమాలు వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదంటున్నారు షారుక్‌ ఫ్యాన్స్‌. తాజాగా తన అభిమానుల కోసం దీపావళి ట్రీట్ ఇచ్చాడు బాలీవుడ్ బాద్‌ షా. తన లేటెస్ట్‌ మూవీ ‘డంకీ’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం ‘డంకీ’ సినిమా టీజర్ విడుదలై మూవీపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను డంకీ ‘డ్రాప్ 1’ పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు దీపావళి పండుగ స్పెషల్ ‘డంకీ’ రెండు కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రేమ, నవ్వు మరియు స్నేహంతో నిండిన రెండు కొత్త పోస్టర్లలో, షారుక్‌తో పాటు తన స్నేహితుల బృందాన్ని పరిచయం చేశారు. తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కింగ్ ఖాన్‌తో కలిసి నిలబడి నవ్వుతున్నారు. ఈ రెండు పోస్టర్లు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. బాలీవుడ్‌లో అపజయమెరుగని రాజ్‌కుమార్ హిరానీ డుంకీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయనతో పాటు అభిజత్ జోషి, కనికా ధిల్లాన్‌లు షారుక్‌ చిత్రానికి కథను అందించారు. ఈ సినిమాలో హార్డీ పాత్రలో షారూఖ్ నటిస్తుండగా, మను పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ అభిమాన నటుడు బొమన్ ఇరానీ ఇక్కడ గులాటీ పాత్రను పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు.

కెనడా, అమెరికాలకు అక్రమంగా వెళ్లే వారి కథను దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ‘డంకీ’ సినిమాలో ముడిపెట్టినట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరానీ ఫిలింస్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరానీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డంకీ’. ఈ ఏడాది క్రిస్మస్‌ నాటికి హిందీతో పాటు పలు భాషల్లో ‘డంకీ’ సినిమా విడుదల కానుంది. నాలుగు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డంకీ’ కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. ‘మున్నా బాయ్ ఎంబీబీఎస్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన హిరానీ.. ఈసారి ఐదుగురు స్నేహితుల కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే షారుక్‌ సినిమా రిలీజ్‌ రోజే ప్రభాస్‌ సలార్‌ మూవీ రిలీజ్‌ అవుతుండడం కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

డుంకీ సినిమా కొత్త పోస్టర్స్..

షారుక్ స్నేహ బృందమిదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..