TOP 9 ET: ఆ న్యూస్ పచ్చి అబద్దం.. ప్రభాస్ టీం. | RIP చంద్రమోహన్.
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సినిమా ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరనే వార్త తెలుసుకుని సహ నటులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ కన్నుమూసారు చంద్రమోహన్.
01.Chandra Mohan
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణవార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సినిమా ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరనే వార్త తెలుసుకుని సహ నటులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ కన్నుమూసారు చంద్రమోహన్.
02.Salaar
సలార్ ట్రైలర్ అప్ డేట్ కోసం చూస్తున్న అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు యూనివర్సల్ ట్రైలర్ ఒకటే కట్ చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్‌తోనే ఉంటుందని దాని అర్థం. అయితే అందులో నిజం లేదని.. అలాంటిదేం ప్లాన్ చేయలేదని చెప్పారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 1న సలార్ ట్రైలర్ విడుదల కానుంది.
03.Game Changer
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తుండగా.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పారు మేకర్స్. దివాళికి ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ రావట్లేదని తెలిపారు. ఆడియో డిస్టర్బెన్సుల వల్ల వాయిదా వేస్తున్నామని.. కొత్త డేట్ త్వరలోనే చెప్తామని క్లారిటీ ఇచ్చారు గేమ్ ఛేంజర్ టీం.
04. Sunil
పుష్ప తర్వాత సునీల్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. అంతకుముందు కేవలం కమెడియన్‌గా ఉన్న ఈయన.. ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళంలోనూ వరస సినిమాలు చేస్తున్నారు. తాజాగా మలయాళ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారు సునీల్. మమ్ముట్టి సినిమాతో సునీల్ డెబ్యూ చేస్తున్నారు. వైశాఖ్ తెరకెక్కిస్తున్న టర్బో సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు సునీల్.
05. Extra
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని బ్రెష్ వేస్కో అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 8న విడుదల కానుంది ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.
06.Niharika
నటిగా ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిన నిహారిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగానూ మారిపోయారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఓ సినిమా నిర్మిస్తున్నారు నిహారిక. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ గ్లాస్ రూమ్‌లో జరిగాయి. నూతన నటీనటులతో ఈ సినిమా నిర్మిస్తున్నారు నిహారిక.
07.Kota Bommali
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కిస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్’. ఈ చిత్రంలోని ‘లింగి లింగి లింగిడి’ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా 30 మిలియన్ వ్యూస్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. ‘కోట బొమ్మాళి పి.ఎస్’ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
08.Salman Khan
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టైగర్ 3. వైఆర్‌ఎఫ్ స్పై సిరీస్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్ తన కెరీర్‌లోనే టఫ్ యాక్షన్ సీక్వెన్స్ టైగర్ 3 కోసం చేశానని చెప్పారు. ఓ బైక్ చేజ్ సీన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు.
09.Ananya
లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అనన్య పాండే, ఈ ఏడాది దీపావళి పండుగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముంబైలోని ఓ కాస్ట్‌లీ ఏరియాలో సొంత ఫ్లాట్ కొన్న అనన్య, ఈ మధ్య అందులోకి షిఫ్ట్ అయ్యారు. తన ఫ్లాట్‌లో పూజ చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.