Sharukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అదే సమయంలో కొడుకు ఆర్యన్ కోసం షారుఖ ఖాన్ కూడా నిజ జీవితంలో కోర్టు మెట్ల వరకూ వెళ్ళాడు. ఆర్యన్ ఖాన్ కోర్టులు, జైలు, బెయిల్ తర్వాత ఇంటికి చేరుకున్నాడు. అయితే వివాదాలకు కేంద్ర బిందువుగా మారినతనయుడితో ఇప్పుడు షారుఖ్ కు సరికొత్త చిక్కులొచ్చాయట.
ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆర్యన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా భద్రతా సమస్య ఏర్పడిందట. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆర్యన్ పై పడింది. దీంతో ఈ స్టార్ కిడ్ బాడీ గార్డ్ లేకుండా అడుగు బయట పెట్టె పరిస్థితి లేదట. దీంతో ఆర్యన్ కు బయటకు వెళ్తున్న సమయంలో రవి సింగ్ బడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ రవి సింగ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు బాడీ గార్డ్.. గత కొన్ని ఏళ్లగా షారుఖ్ దగ్గర పనిచేస్తూ.. ఫ్యామిలీకి నమ్మకమైన వ్యక్తిగా మారిపోవడేమ్ కాదు.. కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. ఇప్పుడు షారుఖ్ జూనియర్ రక్షణ బాధ్యతను చేపట్టాడు. ఆర్యన్ ఎక్కడికి వెళ్లినా జనంతో పాటు.. మీడియా కూడా చుట్టుముట్టేస్తుంది. దీంతో ఈ జూనియర్ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లడం లేదు.. రవి సింగ్.. తనయుడికి రక్షకుడిగా వెళ్లిపోవడంతో.. షారుఖ్ ఖాన్ కు మరొక అంగరక్షకుడు అవసరమయ్యాడు. అందుకనే నమ్మకమైన వ్యక్తి కోసం వెదుకుతున్నట్లు తెలుస్తుంది.
షారుఖ్ రక్షకుడి కోసం వేడుకుంటున్నాడు అనే వార్తలు వినిపించిన వెంటనే అనేక సెక్యూరిటీ ఏజెన్సీలు, ప్రయివేట్ సెలబ్రెటీ గార్డ్స్ పోటీ పడుతున్నాయట. సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలు, ప్రైవేట్ సెలబ్రిటీ సెక్యూరిటీ గార్డులు కుప్పలుతెప్పలుగా అప్లికేషన్లు పంపుతున్నారట.
షారుఖ్ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ వెబ్‌సైట్‌కి బాడీగార్డ్ బయోడేటాలు భారీ సంఖ్యలో వచ్చినట్లు బీ టౌన్ టాక్. అయితే ఈ అప్లికేషన్ల పై ఇంకా షారుఖ్ ఖాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు కొత్తగా తీసుకునే అంగరక్షకుడు సీనియర్ కింగ్ ఖాన్ కోసమా.. లేక తనయుడు ఆర్యన్ కోసమా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు.
Also Read: శీతాకాలంలో సూపర్ ఫుడ్… వేడివేడిగా బ్రకోలీ సూప్.. తయారీ