ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ప్రాణ హాని ఉంది. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంటి సమీపంలో కాల్పులు జరిగాయి. ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు . ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇద్దరు అపరిచితులు కాల్పులు జరపడం దిగ్భ్రాంతికరం. ఈ ఘటనతో మా కుటుంబం ఆందోళన చెందుతోంది. దురదృష్టం ఏంటంటే.. మా కుటుంబానికి ఆప్తమిత్రులమంటూ కొందరు మీడియాలో తేలికపాటి ప్రకటనలు చేస్తున్నారు. ఈ సంఘటన ఒక పబ్లిసిటీ జిమ్మిక్ అని కొందరు మాపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. అయితే అది నిజం కాదు. అలాంటి వారి మాటలను సీరియస్‌గా తీసుకోవద్దు’ అని సల్లూ కుటుంబం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే కాల్పుల ఘటనతో తీవ్ర ఆందోళనలో ఉన్న సల్మాన్ ఖాన్ తన ఇల్లు ఖాళీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సల్లూ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్పందించారు.
సల్మాన్‌కి ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేసే ఉద్దేశం లేదని అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశారు. ‘ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్తే ప్రాణహాని తప్పుతుందని భావిస్తున్నారా? అవును అయితే, మీరు కూడా అదే చేయవచ్చు. కానీ వాస్తవం అలా కాదు. మా నాన్నగారు చాలా ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉండేవారు. సల్మాన్ ఖాన్ కూడా చాలా సంవత్సరాలు గా ఇక్కడే ఉంటున్నాడు. అది వారి ఇల్లు. ఇల్లు ఖాళీ చేస్తే మిమ్మల్ని వదిలిపెడతామని ఎవరూ అనలేదు. అలా అయితే ఇల్లు ఖాళీ చేసే ఆలోచన ఉండేది’అని అర్బాజ్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఏప్రిల్ 16 ముంబైలోని బాంద్రా నివాసంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిశారు. భద్రతా విషయంలో సల్మాన్ కుటుంబ సభ్యులకు పూర్తి భరోసానిచ్చారు.
VIDEO | Maharashtra CM Eknath Shinde (@mieknathshinde) meets actor Salman Khan (@BeingSalmanKhan) at Galaxy Apartment in Mumbai.
On Sunday, two motorcycle-borne persons had opened fire outside Salman Khan’s house in Mumbai’s Bandra and fled the spot. They were apprehended late… pic.twitter.com/k16Eu4uG7A
— Press Trust of India (@PTI_News) April 16, 2024
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at the residence of actor Salman Khan.
On the firing incident outside actor Salman Khan’s residence on April 14, CM Eknath Shinde says, “I met with Salman Khan and assured him the government is with him. I also directed the police… pic.twitter.com/liweoYNtmX
— ANI (@ANI) April 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.