Salaman Khan: ఆ వింత వ్యాధితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కండల వీరుడి షాకింగ్ కామెంట్స్..
Salaman Khan: బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరున్న సల్మాన్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2017లో ట్యూబ్‌లైట్ సినిమా సమయంలో ఈ వ్యాధి గురించి సల్మాన్ బయటపెట్టాడట.
Salaman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salaman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదు పదుల వయసున్న అతను రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో ఫిట్‌గా, హెల్దీగా ఉంటారు. వర్కట్లు, ఎక్సర్‌సైజలు చేస్తూ ఫిజిక్ మెయింటైన్ చేయడం సల్మాన్‌కు బాగా అలవాటు. అభిమానులు కూడా అతనిని కండల వీరుడని ముద్దుగా పిలుచుకుంటారు. ఈక్రమంలో బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరున్న సల్మాన్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2017లో ట్యూబ్‌లైట్ సినిమా సమయంలో ఈ వ్యాధి గురించి సల్మాన్ బయటపెట్టాడట. తాజాగా మరోసారి దీని గురించి మాట్లాడిన సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘నేను ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే నరాల రుగ్మతకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను. దీని వల్ల ఎక్కువగా మాట్లాడితే నా ముఖ భాగం చాలా నొప్పిగా అనిపించేది. ముఖం కూడా వంకర్లు పోతుంది. అందుకే నేను ఎక్కువ సేపు మాట్లాడలేకపోయేవాడిని. బ్రష్ చేసుకున్నప్పుడు, మేకప్ వేసుకున్న సమయాల్లో నొప్పి తీవ్రంగా ఉండేది. ఇక ఇక రాత్రి సమయంలో భరించలేనంతా నొప్పి ఉండేది. దీనిని భరించలేక ఒక్కోసారి ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చేవి. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. దీని కోసం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాను. అదేవిధంగా నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు సల్మాన్. కాగా కండలవీరుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అతను త్వరగా ఈ సమస్య నుంచి కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా మెగాస్టార్ నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: