Salman-Ram Charan: సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ పంచుకోనున్న మెగా హీరో.. స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్

బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు. అదే సమయంలో ఈ సినిమాతో తెరంగేట్రం చేసేందుకు కొందరు స్టార్లు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నాడట.

Salman-Ram Charan: సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ పంచుకోనున్న మెగా హీరో.. స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్
Salman Khan Ram Charan

Updated on: Oct 31, 2022 | 3:33 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మెగా ఫ్యామిలీకి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో .. తెలుగులో డబ్ చేసిన సమయంలో సల్మాన్ పాత్రకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు.. అంతేకాదు.. సల్మాన్ ఖాన్ ఇటీవల మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో కీలక పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ సల్మాన్ ఖాన్  మెగా హీరో స్క్రీన్ పంచుకోనున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు. అదే సమయంలో ఈ సినిమాతో తెరంగేట్రం చేసేందుకు కొందరు స్టార్లు రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రకటించాడు. ఈ వార్త ప్రస్తుతం బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో  రామ్ చరణ్ ని చూడాలని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ-టైమ్స్ కథనం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒక ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయనున్నారు.  రామ్ చరణ్ గొప్ప డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమాలో సల్మాన్‌తో స్పెషల్ సాంగ్ లో చేసే డ్యాన్స్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్:

అద్భుతమైన దృశ్యం:

ఇప్పుడు ఈ వార్త వైరల్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సల్మాన్‌, రామ్‌చరణ్‌లను ఓకే స్క్రీన్‌పై చూడాలని అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో  మెగా స్టార్ చిరంజీవితో కలిసి సల్మాన్ అతిధి పాత్రలో నటించాడు. సినిమాలో చిరు తో సల్మాన్ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో సల్మాన్ డ్యాన్స్ కూడా చాలా ఐకానిక్‌గా ఉండబోతోందని ఇప్పుడు భావిస్తున్నారు.

బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్  ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2023లో ఈద్ సందర్భంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీంతో పాటు షహనాజ్ గిల్, పాలక్ తివారీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరికీ ఇదే బాలీవుడ్ డెబ్యూ. ఈ చిత్రం నుండి సల్మాన్ ఖాన్  ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఇది అభిమానులకు బాగా నచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..