Ranbir Kapoor: కూతురి విషయంలో రణబీర్ ఆందోళన.. ఎందుకు పెళ్లి ఆలస్యంగా చేసుకున్నా అంటూ ..

|

Dec 10, 2022 | 1:41 PM

ఇటీవల సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు.. పేరెంటింగ్ హుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన కూతురుతో తండ్రిగా ఉండడం గురించి చెప్పుకొచ్చాడు

Ranbir Kapoor: కూతురి విషయంలో రణబీర్ ఆందోళన.. ఎందుకు పెళ్లి ఆలస్యంగా చేసుకున్నా అంటూ ..
Ranbir Kapoor
Follow us on

బాలీవుడ్ మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్.. అలియా దంపతులు ప్రస్తుతం తమ కూతురితో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. గత నెలలో అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత రణబీర్ తదుపరి సినిమా సెట్‏లో కనిపించలేదు. తన భార్య.. పాపకు పూర్తిగా తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు.. పేరెంటింగ్ హుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన కూతురుతో తండ్రిగా ఉండడం గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తల్లిదండ్రులుగా ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అలియా.. తాను తమ బిడ్డకు ఎలాంటి భవిష్యత్తు అందించాలనుకుంటున్నారో తెలియజేశారు.

తండ్రి అయిన తర్వాత మీలో మార్పు గురించి చెప్పండి ? అని మీడియా ప్రశ్నించగా.. ” నేను పెళ్లి కోసం ఎందుకు ఇంత సమయం తీసుకున్నానో అని అశ్చర్యపోతున్నాను. నా అతి పెద్ద అభద్రత ఏమిటంటే.. నా పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి నాకు 60 ఏళ్లు వస్తాయి. అప్పుడు నేను వాళ్లతో ఫుడ్ బాల్ ఆడగలనా ? నేను వారితో పరిగెత్తగలనా ? అనే సందేహం వ్యక్తమవుతుంది. పెద్దల ప్టల గౌరవం.. సమానత్వం.. మా తల్లిదండ్రుల నుంచి.. అలాగే జీవితంలో నేర్చుకున్న అనేక విషయాలను మా పిల్లలకు అందించాలనుకుంటున్నాము.. ఉదాహరణకు మేమిద్దరం పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాం.. వారితో ఉండే ఆ భావోద్వేగ క్షణాలను పొందుపరచడం చాలా ముఖ్యం.. నేను ఎక్కువగా పనిచేయను. దాదాపు 180-200 రోజులు మాత్రమే పనిచేస్తాను. కానీ అలియా నాకంటే ఎక్కువగా బిజీ ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని సమతుల్యం చేస్తాము. అలియా షూటింగ్ తో బిజీ ఉంటే.. నేను ఇంట్లో ఉంటాను.. నేను సినిమా కోసం పనిచేస్తుంటే.. అలియా ఇంట్లో ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

గత కొన్నెళ్లుగా ప్రేమలో ఉన్న అలియా.. రణబీర్ ఈ ఏడాదిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 6న వీరి జీవితంలోకి పాపను ఆహ్వనించారు. అలియా, రణబీర్ చివరిసారిగా బ్రహ్మాస్త్ర సినిమాలో కలిసి నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.